»Telangana Group 4 Results In A Few Days In Telangana
Telangana Group 4: మరికొన్ని రోజుల్లో గ్రూప్4 రిజల్ట్స్?
తెలంగాణలో గ్రూప్4 ఫలితాలు మరికొన్ని రోజుల్లో రానున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే రిలీజ్ చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.
తెలంగాణ గ్రూప్ 4(telangana Group 4) పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ పరీక్ష ఫలితాల(results) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో ఫలితాలను రిలీజ్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ ఫలితాలు విడుదల చేయాలని అధికారులు సిద్ధమవుతున్నారు. 8 వేలకుపైగా పోస్టులు ఉన్న నేపథ్యంలో దాదాపు 7 లక్షలమందికిపైగా అభ్యర్థులు ఎగ్జామ్ రాశారు. ఈ క్రమంలో ఫలితాలు విడదల చేస్తే ప్రభుత్వానికి అనుకూలంగా ఎంపికైన అభ్యర్థుల్లో సానుకూల ధోరణి వచ్చే అవకాశం ఉందని కూడా పలువురు అంటున్నారు.
ఈ నేపథ్యంలో త్వరగా గ్రూప్ 4 ఫలితాలు రిలీజ్ చేయాలని అధికారులు(officers) ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,039 ఖాళీల భర్తీకి TSPSC గ్రూప్ 4 పరీక్షను జూలై 1, 2023న నిర్వహించారు. పరీక్ష అనేది రెండు పేపర్లు, జనరల్ స్టడీస్ మరియు డిస్క్రిప్టివ్ పేపర్లతో కూడిన వ్రాత పరీక్షను జరిపారు. ఈ పరీక్షకు తెలంగాణ వ్యాప్తంగా 9,51,205 మంది అప్లై చేసుకోగా, సుమారు 80 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఈ పోస్టుల భర్తీకి ఈ పరీక్ష నిర్వహించబడింది. పరీక్షకు అర్హత మార్కులు జనరల్ 40%, OBC 35%, SC 30%, ST 30%. రాష్ట్రంలో గ్రూప్ 4 నోటిఫికేషన్ డిసెంబర్ 1, 2022న విడుదలైంది. ఈ నేపథ్యంలో ఏడాదిలోపై ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చూడండి:Rain Alert: తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ