»Suriya Reacts To Wife Jyothika Fitness Video My Wonder Woman
Jyothika: జ్యోతిక ఫిట్నెస్ వీడీయోకి సూర్య ఫిదా..!
నటి జ్యోతిక(Jyothika) 50కి పైగా చిత్రాల్లో నటించింది. అయినా కూడా ఫిట్ నెస్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల తాను వర్క్ అవుట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ లలో జ్యోతిక ఒకరు. ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో అదరగొట్టిన ఆమె పెళ్లైన తర్వాత సినిమాలకు దూరమయ్యారు. తమ పిల్లలు కొంచెం పెద్దవారు అయిన తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. సలెక్టివ్ కథలను ఎంచుకుంటూ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్ లోనూ ఆఫర్లు వస్తున్నాయి. అజయ్ దేవగన్, మాధవన్లు నటించే సూపర్ నేచురల్ థ్రిల్లర్తో 25 ఏళ్ల తర్వాత జ్యోతిక(Jyothika) హిందీ సినిమాలో నటించనుంది. ఇందులో జ్యోతిక కీలక పాత్రలో నటిస్తుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. కాగా, బాలీవుడ్ ఆఫర్లు వస్తుండటంతో జ్యోతిక ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టింది. ఆమె ఫిట్నెస్ కోసం జిమ్(gym)లో చెమటోడుస్తున్నారు. ఆమె చేస్తున్న వ్యాయామాలు చూస్తుంటే ఎవరైనా షాకవ్వాల్సిందే. అంత కఠినంగా ఉండటం గమనార్హం.
కాగా, భార్య జ్యోతిక పడుతున్న కష్టాన్ని చూసి సూర్య ఫిదా అయిపోయాడు. ఆమె ఫిట్నెస్ వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆయన, మై సూపర్ ఉమెన్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా, ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. ఆమె పడుతున్న కష్టాన్ని చూసి అందరూ ఫిదా అయిపోయి, జ్యోతిక(Jyothika)పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాలుగు పదుల వయసులో ఇంత కఠిన వ్యాయమాలు ఎలా చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.