వైఎస్ వివేకానంద కూతురు సునీత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసులో అవినాష్‌కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేశారు.
Sunitha challenges YS Avinash bail petition at Supreme court
Sunitha:వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి (YS Avinash) తెలంగాణ హైకోర్టు (ts high court) మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై సునీత (sunitha) సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో (supreme court) పిటిషన్ వేశారు. తెలంగాణ హైకోర్టు (high court) ఇచ్చిన తీర్పును ఆమె సవాల్ చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు (supreme court) రేపు విచారిస్తామని తెలిపింది.
వివేకా హత్య కేసులో (viveka murder case) ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి (avinash reddy) పిటిషన్ వేయగా.. హైకోర్టు ధర్యాసనం ఇచ్చింది. ఈ నెల 25వ తేదీ వరకు సీబీఐ (cbi) విచారణకు హాజరుకావాలని స్పష్టంచేసింది. 25వ తేదీన బెయిల్‌కు సంబంధించి తుది తీర్పును వెల్లడిస్తామని పేర్కొంది. ఇంతలో సునీత (sunitha) సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
వివేకా హత్య కేసు (viveka murder case) విచారణకు సీబీఐ (cbi) ఈ నెల 30వ తేదీ లోపు పూర్తి చేయాలి. అందుకే విచారణను స్పీడప్ చేసింది. అవినాష్ (avinash) అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి (uday kumar reddy) , అవినాష్ (avinash) తండ్రి భాస్కర్ రెడ్డిని (bhaskar reddy) అరెస్ట్ చేసింది. అవినాష్‌ను (avinash) కూడా అదుపులోకి తీసుకోవాలని అనుకుంటుండగా.. ముందుస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయడం.. తాత్కాలిక ఊరట లభించిన సంగతి తెలిసిందే.