»Storm Floods In Brazil Three Dead 12 Members Missing
Brazil:లో వరదలు..ముగ్గురు మృతి, 12 మంది గల్లంతు
బ్రెజిల్(Brazil)లోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే డో సుల్లో భారీ వరదల కారణంగా ముగ్గరు మృత్యువాత చెందగా..మరో 12 మంది తప్పిపోయినట్లు బ్రెజిలియన్ మీడియా పేర్కొంది.
దక్షిణ బ్రెజిల్(Brazil)లోని రియో గ్రాండే దో సుల్ ప్రావిన్స్‌లో తుఫానులు(stroms) విధ్వంసం సృష్టిస్తున్నాయి. దీంతో ముగ్గురు మరణించగా, మరో 12 మంది గల్లంతైనట్లు అక్కడి మీడియా తెలిపింది. సావో లియోపోల్డో నగరంలో ఇద్దరు వ్యక్తులు మరణించారని అధికారులు పేర్కొన్నారు. కాగా తీర ప్రాంతమైన మాక్విన్లో ఒకరు మృతి చెందినట్లు ప్రకటించారు. మరోవైపు తప్పిపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
దీంతోపాటు వరదల కారణంగా కష్టాల్లో కూరుకుపోయి సాయం కోసం ఎదురు చూస్తున్న వారిని కూడా ఆదుకుంటామని అక్కడి గవర్నర్(governor) తెలిపారు. సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు చికిత్స అందించడంతోపాటు ఆహారం కూడా సరఫరా చేయాలని సూచించారు.
ఈ తుఫాను నేపథ్యంలో రియో గ్రాండే దో సుల్‌లోని అనేక రహదారులపై(roads) రాకపోకలు నిలిచిపోయాయు. అదే సమయంలో రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు విమాన ప్రయాణాలు కూడా రద్దు చేయబడ్డాయి. దీంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు అంతరాయం కూడా ఏర్పడింది. గత 24 గంటల్లో జూన్ నెలలో కురిసిన వర్షాల కంటే ప్రస్తుతం రెట్టింపు వర్షాలు కురిశాయని అక్కడి ప్రజలు, అధికారులు చెబుతున్నారు.