వరల్డ్ కప్ మ్యాచులకు భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ దూరం కానున్నాడు. డెంగ్యూ జ్వరం రావడంతో అతను ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ ఆడకపోవచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వరల్డ్ కప్ టోర్నీ (World Cup -2023)కి ముందు టీమిండియా (TeamIndia) షాక్ తగిలింది. భారత క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (Subhman Gill) డెంగ్యూ జ్వరం (Dengue Fever)తో బాధపడుతున్నాడు. దీంతో ఆదివారం ఆస్ట్రేలియా (Australia)తో జరగనున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లో గిల్ ఆడకపోవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈమధ్య కాలంలో వన్డే మ్యాచుల్లో గిల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో రాణించాడు. అతని ప్రదర్శనతో క్రికెట్ అభిమానులకు (Cricket Fans) మరింత చేరువయ్యాడు.
జ్వరంతో బాధపడుతున్న గిల్‌కు శుక్రవారం పరీక్షలు చేయగా ఆ టెస్టుల్లో గిల్‌కు డెంగ్యూ (Dengue Fever) ఉన్నట్లు తేలింది. సాధారణ జ్వరం వస్తే యాంటిబయోటిక్స్ తీసుకుని మ్యాచ్ ఆడే అవకాశం ఉందని, కానీ వైద్య బృందం సలహా మేరకు గిల్‌ను ఆడించే అవకాశం ఉంటుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఒక వేళ డెంగ్యూ జ్వరం వల్ల గిల్ మ్యాచ్‌కు దూరం అయితే అతని స్థానంలో ఇషాన్ కిషన్‌ను రంగంలోకి దించే అవకాశం ఉంది.
ఈ ఏడాది వన్డే మ్యాచుల్లో గిల్ టాప్ స్కోర్ (Top Score) చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. 72.35 యావరేజ్‌తో గిల్ 1230 పరుగులు చేసి అద్భుత ప్రదర్శనను కొనసాగించాడు. గిల్ స్ట్రయికింగ్ రేట్ 105గా ఉండగా అందులో 5 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. 208 పరుగుల టాప్ స్కోర్‌తో గిల్ వన్డేల్లో కొనసాగుతున్నాడు. ఈ వరల్డ్ కప్ (World Cup-2023)లో మరిన్ని రికార్డులు బద్దలు కొడతాడని అందరూ అనుకుంటూ ఉండగా జ్వరం వల్ల గిల్ వరల్డ్ కప్‌కు దూరం అయ్యే అవకాశం ఉంది.