»New Zealands Grand Victory England Set A Rare Record
ENG Vs NZ: న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ..అరుదైన రికార్డ్ నెలకొల్పిన ఇంగ్లండ్
వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టుపై న్యూజిలాండ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లంతా డబుల్ డిజిట్ స్కోర్ చేసి రికార్డు నెలకొల్పారు.
ఐసీసీ వరల్డ్ కప్-2023 (ICC World Cup-2023) టోర్నీలో నేడు మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ (England)పై న్యూజిలాండ్ (New Zealand) ఘన విజయం సాధించింది. డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్‌తో వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో విజయాన్ని పొందింది. గత వరల్డ్ కప్ నెగ్గిన ఇంగ్లండ్ జట్టు నేటి మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 282 పరుగులు చేసింది.
ఆ తర్వాత బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు అద్భుతంగా ఆడింది. ఓపెనర్ డెవాన్ కాన్వే, వన్ డౌన్ బ్యాట్స్ మన్ రచిన్ రవీంద్ర సెంచరీలతో రాణించారు. ఓపెనర్ విల్ యంగ్ డకౌట్ అయినా ఆ ప్రభావమే కనిపించలేదు. న్యూజిలాండ్ (New Zealand) టీమ్ 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం 36.2 ఓవర్లలో సాధించింది. కాన్వే 121 బంతుల్లో 152 పరుగులు చేశాడు. రచిన్ రవీంద్ర 96 బంతుల్లో 123 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.
ఇంగ్లండ్ (England) రికార్డు:
వన్డే వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ లోనే ఇంగ్లండ్ అరుదైన రికార్డును సాధించింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ప్లేయర్లంతా డబుల్ డిజిట్ స్కోరు చేసి రికార్డు నెలకొల్పారు. మొదట టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టులో అందరూ డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. జో రూట్ 77, జోస్ బట్లర్ 43, జానీ బెయిర్‌స్టో 33, డేవిడ్ మలన్ 14, బ్రూక్ 25, మోయిన్ అలీ 11, లివింగ్‌స్టోన్ 20, సామ్ కరన్ 14, క్రిస్ వోక్స్ 11, ఆదిల్ రషీద్ 15 (నాటౌట్), మార్క్ వుడ్ 13 (నాటౌట్) రన్స్ చేశారు. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇలా ఒక జట్టుకు చెందిన 11 మంది ప్లేయర్లు డబుల్ డిజిట్ స్కోర్లు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.