కింగ్ ఖాన్ ఈజ్ బ్యాక్ అంటూ.. పఠాన్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేశాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. అదే జోష్‌లో అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌ని పరుగులు పెట్టిస్తున్నాడు షారుఖ్. సెప్టెంబర్‌లో జవాన్‌గా రాబోతున్న ఈ స్టార్ హీరో.. ఆ తర్వాత డుంకీ(Dunki)గా రాబోతున్నాడు. అయితే షారుఖ్ డుంకీకి 155 కోట్లు అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా సింగిల్ లాంగ్వేజ్‌లో అంటే మామూలు విషయం కాదంటున్నారు.
అప్పటి వరకు వరుస ఫ్లాపుల్లో ఉన్న బాద్షా(Shah Rukh khan)కు..పఠాన్ సినిమా ఏకంగా వెయ్యి కోట్లు రాబట్టి.. బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. ఈ సినిమాతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇచ్చాడు బాద్షా. ఇక ఇప్పుడు జవాన్‌గా రాబోతున్నాడు. కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీని సెప్టెంబర్ 7న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా జవాన్ ప్రివ్యూను రిలీజ్ చేయగా సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న ‘డుంకీ’ సినిమా పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. డిసెంబర్ 22న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. సంజు సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న రాజ్ కుమార్ హిరానీ.. ఈ సినిమాలో షారుఖ్‌ని ఎన్నడూ చూడని విధంగా చూపించబోతున్నాడు.
తాప్సీ హీరోయిన్గా నటిస్తోంది. అందుకే డుంకీ పై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది. కానీ అప్పుడే డుంకీ(Dunki) ఓటిటి హక్కులు భారీ రేటుకు అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది. జియో డిజిటల్ సంస్థ ఈ సినిమా ఓటిటి రైట్స్ కోసం అక్షరాలా 155 కోట్లు చెల్లించిందని బాలీవుడ్ వర్గాల సమాచారం. అది కూడా ఒక్క హిందీ వెర్షన్ ఓటిటి హక్కులకు ఈ రేంజ్ డీల్ అంటే మామూలు విషయం కాదు. అసలు ఇప్పటి వరకు డుంకీ ఎలాంటి గ్లింప్స్.. కనీసం ఫస్ట్ లుక్ కూడా బయటికి రాలేదు. కానీ రాజ్ కుమార్ హిరానీ, షారుఖ్ ఖాన్ క్రేజ్‌తో భారీ డిమాండ్ ఏర్పడిందని చెప్పొచ్చు. పైగా మరి డుంకీ సినిమాతో షారుఖ్ ఖాన్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.