KRNL: నంద్యాల జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం తప్పింది. PDTR-KRNL వెళ్తున్న RTC బస్సుకు కోవెలకుంట్ల సమీపంలో టైర్ అండ్ రాడ్ విరిగింది. దీంతో బస్సు టర్న్ చేసేందుకు వీలు లేకుండా పోయింది. 100 అడుగుల దూరంలోనే ఓ ప్రమాదకర మలుపు ఉండటంతో, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును నిలిపేశారు. దీంతో 30 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.