»Road Accident The Bus Went Out Of Control 17 People Died
Road Accident: అదుపుతప్పిన బస్సు..17 మంది దుర్మరణం
బస్సు చెరువులో పడటంతో 17 మంది దుర్మరణం చెందిన ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
బస్సు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటన(Bus Accident)లో 17 మంది దుర్మరణం (17 died) చెందారు. ఈ ప్రమాదంలో చాలా మందికి గాాయాలయ్యాయి. బస్సులో 60 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఆ బస్సు బంగ్లాదేశ్ లోని భండారియా సబ్ డిస్ట్రిక్ట్ నుంచి హెడ్ క్వార్టర్స్ బరిషాల్‌కు వెళ్తోంది. ఝల్కరి జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనతో మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చెరువులో నుంచి 17 మంది మృతదేహాలను(Dead bodies) పోలీసులు వెలికితీశారు. భారీ వర్షాలకు చెరువు పూర్తిగా నిండింది. దీంతో క్రేన్ల సహాయంతో బస్సును బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. ఎనిమిది మంది మహిళల మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఈ సమాచారాన్ని సబ్ ఇన్స్పెక్టర్ గౌతమ్ కుమార్ ఘోష్ వెల్లడించారు.
బస్సు ప్రమాదం(Bus accident) జరిగిన సమయంలో బస్సులో మొత్తం 65 మంది ఉన్నారని గాయపడిన వ్యక్తి తెలిపారు. తాను డ్రైవర్ సీటు దగ్గర ఉన్నానని, బస్సు నడిపే సమయంలో అజాగ్రత్తగా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఆ వ్యక్తి వెల్లడించారు. బస్సు క్లీనర్‌తో డ్రైవర్ మాట్లాడుతుండటం వల్ల ఈ దారుణం జరిగిందని తెలిపాడు. ప్రమాదంలో తన తండ్రి చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు. సంఘటనా స్థలం వద్ద బాధిత కుటుంబ సభ్యులు బోరున విలపించారు.