• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

రైలు కిందపడి యువకుడు మృతి

SKLM: పాతపట్నం మండలం కాపు గోపాలపురం గ్రామానికి చెందిన రేగేటి రాజేశ్(28) అనే యువకుడు మంగళవారం గుణుపూర్ నుంచి రౌర్కెల వెళ్తుండగా రైలు కిందపడి మృతి చెందాడు. పర్లాకిమిడి-పాతపట్నం రైల్వేస్టేషన్ మధ్య ఈ ఘటన జరిగింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతని మృతి గల కారణాలు తెలియాల్సి ఉంది.

September 25, 2024 / 04:29 AM IST

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

కోనసీమ: ముమ్మిడివరం జాతీయ రహదారి వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపక్కన పడి ఉన్న అతణ్ని స్థానికుల గుర్తించి వెంటనే 108 అంబులెన్స్‌లో కిమ్స్ హాస్పటల్‌కు తరలించారు. ముమ్మిడివరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతనే బైక్ స్కిడ్ అయ్యి పడిపోయి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.

September 25, 2024 / 04:02 AM IST

‘దేశవ్యాప్తంగా 10,700 బోగస్ సంస్థలు’

దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఖజానాను మోసగిస్తూ ఏర్పాటైన నకిలీ కంపెనీలపై జరుగుతున్న డ్రైవ్‌లో జీఎస్టీ అధికారులు భారీ మొత్తం ఎగవేతలను గుర్తించారు. దేశవ్యాప్తంగా రూ.10,179 కోట్ల జీఎస్టీ చెల్లింపులను ఎగ్గొట్టిన 10,700 నకిలీ రిజిస్ట్రేషన్లను పట్టుకున్నట్లు సీనియర్ అధికారి తెలిపారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ల ఆధార్ ధ్రువీకరణ ఇప్పటికే 12 రాష్ట్రాల్లో అమలవుతోందని, అక్టోబర్ 4 నాటికి మరో నాలుగు రాష్ట్రాలు ఈ జ...

September 25, 2024 / 01:59 AM IST

ఇంటర్‌తో రైల్వేశాఖలో 3,445 ఉద్యోగాలు

దేశంలోని రైల్వేజోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టుల కింద 3,445 జాబ్స్‌కు దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యా అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈనెల 21న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, అక్టోబర్ 20 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు https://www.rrbapply.gov.in/ స...

September 25, 2024 / 01:41 AM IST

ఇజ్రాయెల్ దాడుల్లో 492 మంది మృతి

లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 492 మంది మృతి చెందారు. మరో 1600 మందికి పైగా గాయపడ్డారు. కాగా, లెబనాన్‌పై ఈ స్థాయిలో భీకర దాడి.. 2006 నాటి ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా యుద్ధం తర్వాత మళ్లీ ఇప్పుడే జరిగింది.

September 24, 2024 / 10:22 AM IST

భార్యాభర్తలకు యావజ్జీవ కారాగార శిక్ష

ELR: పెదపాడు మండలానికి చెందిన భార్యాభర్తలకు సోమవారం జీవిత ఖైదు శిక్ష పడిందని ఏలూరు పోక్సో కోర్టు ఇంఛార్జ్ పీపీ రామాంజనేయులు తెలిపారు. విజయలక్ష్మికి ఇద్దరు ఆడపిల్లలు ఉండగా.. భర్త మృతితో మేనమామ సతీశ్‌ను పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. ఆ ఇద్దరిపై సతీశ్ అత్యాచారం చేయగా 2023లో కేసు నమోదయిందన్నారు. నేరం రుజువు కావడంతో ఏలూరు పోక్సో కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది.

September 24, 2024 / 09:39 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

VSP: కంచరపాలెం జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై అతివేగంగా డ్రైవ్ చేయడంతో పక్కనే ఉన్న డివైడెర్‌ని బలంగా ఢీ కొట్టారు. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మృతులు కప్పరాడకు చెందిన యువకులుగా స్థానికులు గుర్తించారు.

September 24, 2024 / 09:21 AM IST

వింజమూరులో మోటర్ తీగలు చోరీ

NLR: జిల్లా వింజమూరు మండలంలో మోటర్ తీగలు చోరీ చేయడం సంచలనంగా మారింది. వింజమూరు మండలం తక్కెళ్ళపాడులో పొలంలో ఉన్న ఓ మోటార్ తీగలు, పలు సామగ్రిని దొంగిలించారు. గతంలోనూ ఇలాంటివి చాలా జరిగాయని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికైనా దొంగలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.

September 24, 2024 / 07:57 AM IST

తృటిలో తప్పిన పెను ప్రమాదం

NLR: మనుబోలు మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డుపై ఓ ట్రావెల్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం విజయవాడ నుంచి చెన్నైకి 18 మంది ప్రయాణికులతో వెళ్తుండగా.. యాచవరం రోడ్డు దాటాక బస్సు టైరు పగిలిపోయింది. దీంతో బస్సు అదుపుతప్పి మరో వైపు వెళ్లిపోయింది. ఆసమయంలో వేరే వాహనాల ఉండకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు.

September 24, 2024 / 07:34 AM IST

ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వాహనం సీజ్

HYD: కోట్పల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు సీజ్ చేశారు. ధారూర్ రేంజ్ ఆఫీసర్ రాజేందర్ తన స్పెషల్ టీంతో గస్తీ నిర్వహిస్తుండగా వాగు నుంచి ఇసుకను తీసుకెళ్తున్న వాహనాన్ని పట్టుకొని రేంజ్ ఆఫీసుకు తరలించారు. కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు చేసి పైఅధికారులు ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్లు రేంజ్ ఆఫీసర్ తెలిపారు.

September 24, 2024 / 06:56 AM IST

పేకాట ఆడుతున్న ఏడుగురు అరెస్ట్

VSP: ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ శివారు కల్లివానిపాలెంలో పేకాట శిబిరంపై పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.7 వేలు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

September 24, 2024 / 05:54 AM IST

రోడ్డు ప్రమాదంలో మహిళలకు గాయాలు

KDP: సిద్దవటం మండలంలోని JMJ కాలేజ్ సమీపంలో సోమవారం బద్వేల్ గ్రామానికి చెందిన నాగరత్నమ్మ,(35) బస్సు దిగి రోడ్డు దాటుతుండగా.. ఒంటిమిట్ట మండలం సాలబాద్ గ్రామానికి చెందిన ప్రదీప్(35) ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి తగలడంతో మహిళకు బలమైన గాయం తగిలింది. గాయపడిన మహిళ, ద్విచక్ర వాహనదారునికి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

September 24, 2024 / 05:21 AM IST