చెన్నై యువకుడికి తాను పనిచేసిన కంపెనీ నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. అతడు అనారోగ్య సమస్యకు గురవ్వడంతో జాబ్‌కు రిజైన్ చేసి, ఎక్స్‌పీరియన్స్ లెటర్ ఇవ్వాలని కంపెనీని కోరాడు. అయితే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో తప్పు చేసినట్లు రిపోర్టు ఇస్తామని కంపెనీ బెదిరించింది. అలా చేయకుండా ఉండాలంటే తమకు 3 నెలల జీతం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని రెడ్డిట్‌లో ర్యాండీ31599 అనే య...
AP: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో విషాదం చోటుచేసుకుంది. పాతర్లపల్లిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనం కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్ధులు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు కృష్ణంరాజు(15), శ్రీరాములు(14)గా స్థానికులు గుర్తించారు.
గుజరాత్‌లో ప్యాసింజర్ రైలుకు ప్రమాదం తప్పింది. బొటాడ్ జిల్లా కుండి గ్రామ సమీపంలో రైలుని పట్టాలు తప్పించే కుట్ర జరిగింది. ట్రైక్ పై పడివున్న రైలు పట్టాని ఢీకొన్న ప్యాసింజర్ రైలు అక్కడే నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇకపోతే సెప్టెంబర్ నెలలోనే రైళ్లను పట్టాలు తప్పించేందుకు ప్రయత్నించిన ఐదో ఘటన ఇది.
ELR: తెలంగాణా రాష్ట్రం అశ్వరావుపేట మండలం పాపిడి గూడెం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పామ్ ఆయిల్ గేలలతో వెళ్తుతున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలేనికి చెందిన పుట్టపల్లి వెంకటేశ్వర్లు (20) అనే వ్యక్తి మృతి చెందాడు. దీనిపై అక్కడ పోలీసులు కేసు నమోదు చేశారు.
KRNL: ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల మంగళవారం రాత్రి వరకు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నందవరం మండలం కనకవీడు గ్రామంలో నరసింహుడు అనే వ్యక్తి మట్టి మిద్దె వర్షానికి కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకుపోవడంతో ప్రమాదం తప్పింది. పలు చోట్ల వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
KRNL: నంద్యాల జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం తప్పింది. PDTR-KRNL వెళ్తున్న RTC బస్సుకు కోవెలకుంట్ల సమీపంలో టైర్ అండ్ రాడ్ విరిగింది. దీంతో బస్సు టర్న్ చేసేందుకు వీలు లేకుండా పోయింది. 100 అడుగుల దూరంలోనే ఓ ప్రమాదకర మలుపు ఉండటంతో, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును నిలిపేశారు. దీంతో 30 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.
తమిళనాడులో ఓ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొంతమంది యాత్రికులు తిరుచెందూర్‌లోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఉలుందూర్పేట శివారులోకి చేరుకోగానే వారు వెళ్తున్న మినీ వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణం అతివేగమే కారణమని...
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఏడుగురు మరణించారు. సబర్‌కాంతా జిల్లా హిమ్మత్‌నగర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బాపట్ల: సంతమాగులూరు మండలంలోని సజ్జాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కనకమ్మ అనారోగ్య కారణంగా మంగళవారం రాత్రి మృతిచెందారు. కనకమ్మ మృతిచెందిన విషయం తెలుసుకున్న పలురు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కనకమ్మ సజ్జాపురం సర్పంచ్‌గా 2001- 2006, 2013- 2018 రెండు దఫాల్లో సర్పంచ్‌గా సేవలందించారు.
ప్రకాశం: మార్కాపురం పట్టణానికి చెందిన MBBS విద్యార్థి హరిదీప్ మృతదేహం కోసం గత 3రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మారేడుమల్లి జలపాతంలో స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు వెళ్లిన హరిదీప్ నీటిలో గల్లంతయ్యాడు. ఆదివారం హరిదీప్ గల్లంతు కాగా గత మూడు రోజుల నుంచి మృతదేహం కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కానీ విద్యార్థి ఆచూకి మాత్రం లభ్యం కాలేదని అధికారులు తెలిపారు.
NLR: ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను ఆత్మకూరు పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. ఆత్మకూరు మండలం అప్పారావుపాళెం వద్ద రెండు ట్రాక్టర్లు, గండ్లవీడు వద్ద రెండు ట్రాక్టర్లలో ఇసుక అక్రమ రవాణ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో సీఐ గంగాధర్, ఎస్సై జిలానీ దాడులు నిర్వహించారు. అనంతరం కేసులు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేశారు.
WG: తాడేపల్లిగూడెం మండలం మెట్ట ఉప్పరగూడెం ఊర చెరువులో గేదెలను కడిగేందుకు దిగి యాదాల దేశాలు (45) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. స్థానికులు వెంటనే చెరువులోకి దిగి కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే దేశాలు మృతి చెందాడని అతని తండ్రి సంతోషం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇజ్రాయెల్, హెజ్‌బొల్లాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మృతుల సంఖ్య 560కి చేరుకుంది. మృతుల్లో 50 మంది పిల్లలు, 94 మంది మహిళలున్నారు. నలుగురు వైద్య సిబ్బంది మరణించగా.. 16 మంది గాయపడ్డారు. దాడుల్లో మొత్తం 1,835 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్యశాఖ మంత్రి ఫిరాస్ అబియాద్ వెల్లడించారు. 54 ఆస్పత్రుల్లో వారికి చికిత్స జరుగుతోందన...
ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ మాచవరం పరిధి బీసీ కాలనీలో పేకాట ఆడుతున్న నలుగురిని ఎస్సై తుళ్లూరు శ్రీరామ్ తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి రూ.24,950 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే చర్యలు తప్పవని, అటువంటి పనులపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
VSP: విశాఖలోని కప్పరాడ వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల వివరాలను పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో సీతంపేటకు చెందిన గురుకుపల్లి ప్రవీణ్ కుమార్(20), దొండపర్తి ప్రాంతానికి చెందిన దువ్వపు ప్రశాంత్ కుమార్(20) అక్కడికక్కడే మృతి చెందారు. కప్పరాడ ప్రాంతానికి చెందిన నడిగాన మహేశ్(20) తీవ్రంగా గాయపడ్డాడు. మృతులను కేజీహెచ్ మర్చూరీకి తరలించారు.