• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

డీసీఎం బోల్తా.. వ్యక్తి మృతి

SRPT: మునగాల మండలం మాధవరం వద్ద డివైడర్ ఢీకొని అదుపుతప్పి డీసీఎం బోల్తా పడడంతో డ్రైవర్ మృతి చెందిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు, డీసీఎంలో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

September 27, 2024 / 08:40 AM IST

VIDEO: ‘విద్యుత్ ఘాతానికి గురైన రైతు’

AKP: రోలుగుంట మండలం బుచ్చంపేట గ్రామానికి చెందిన శెట్టి రాంబాబు అనే రైతు శుక్రవారం ఉదయం విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో అతనిని వెంటనే సమీప బంధువులు చికిత్స నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖపట్నం కెజిహెచ్ ఆసుపత్రికి తరలించారు.

September 27, 2024 / 08:07 AM IST

గోవింద్రాలలో దారుణ హత్య…!

KMM: కామేపల్లి మండలం గోవింద్రాలలో ఓ వికలాంగుడి దారుణ హత్య గురువారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల వివరాలిల ప్రకారం.. గోవింద్రాలకి చెందిన బావుసింగ్(30) దివ్యాంగుడు. ప్రభుత్వ కార్యాలయాలలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

September 27, 2024 / 07:55 AM IST

అభిమానినంటూ ఆభరణాలు దొంగలించిన మహిళ

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను ఓ 32 ఏళ్ల మహిళ నమ్మించి మోసగించింది. మీ ఫ్యాన్‌ అంటూ.. అతడితో ఫొటోలు దిగుతూ రూ.లక్షల విలువైన బంగారు ఆభరణాలను కాజేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో ఆమెతోపాటు ఆమె భర్తనూ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌ఫ్లుయెన్సర్‌ను బురిడీ కొట్టించి మహిళ దొంగిలించిన 100 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

September 26, 2024 / 05:05 PM IST

డ్రగ్స్ కేసులో సినీ నటుడు అభిషేక్ అరెస్ట్

TG: డ్రగ్స్ కేసులో సినీ నటుడు అభిషేక్ అరెస్టయ్యాడు. SR నగర్, జూబ్లీహిల్స్ పీఎస్‌లో  అభిషేక్ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుల విషయంలో కోర్టుకు హాజరుకాకపోవడంతో వారెంట్ జారీ చేశారు. దీంతో పారిపోయి గోవాలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే న్యాబ్ పోలీసులు అభిషేక్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్ సీసీఎస్‌కు తరలించారు.

September 26, 2024 / 04:55 PM IST

సికింద్రాబాద్ లో యువకుడి ఆత్మహత్య

HYD: సికింద్రాబాద్ లాడ్జ్‌లో యవకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భూపాలపల్లికి చెందిన అక్షయ్ (24)గతేడాది నగరానికి వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం సొంతూరుకు వెళ్లి తిరిగి మంగళవారం రాత్రి మార్కెట్ PSపరిధి బండిమెట్లోని లాడ్జిలో రూం తీసుకున్నాడు. బుధవారం ఉదయం మిత్రులు, కుటుంబసభ్యుల్లో తనకు ఇష్టమైన వాళ్ల ఫొటోలను వాట్సాప్ స్టేటస్ పెట్టి ఉరేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

September 26, 2024 / 03:28 PM IST

పవిత్ర స్నానాలు.. 43 మంది మృతి

బిహార్‌లో ‘జీవిత్‌పుత్రిక’ పండగ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని నదుల్లో పవిత్ర స్నానాలకు ప్రజలు పోటెత్తారు. ఈ క్రమంలో 15 జిల్లాల్లో ప్రమాదవశాత్తు 43 మంది మృతి చెందగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

September 26, 2024 / 03:14 PM IST

ఇజ్రాయెల్‌ దాడి.. 23 మంది మృతి

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడింది. బేకా వ్యాలీలోని బాల్‌బెక్ నగరం సమీపంలో ఉన్న ఓ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపింది. దీంతో భవనం కూలి.. 23 మంది సిరియా దేశస్థులు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

September 26, 2024 / 03:02 PM IST

రెండు వర్గాల మధ్య ఘర్షణ.. 25 మంది మృతి

పాకిస్థాన్‌లోని వాయువ్య ప్రాంతంలో షియా, సున్నీ వర్గాల మధ్య గత కొన్ని రోజులుగా భూ వివాదానికి సంబంధించి ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ఘటనలో దాదాపు 25 మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. పాక్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లోని వాయువ్య ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఉన్న కుర్రం జిల్లాలో ఈ ఘర్షణలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ ఘర్షణలను నివారించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

September 26, 2024 / 01:20 PM IST

ఎద్దును చంపితిన పెద్దపులి

ప్రకాశం: అర్ధవీడు మండలం అచ్చంపేట గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో రెండు రోజుల క్రితం మేత కోసం వెళ్ళిన ఎద్దుపై పెద్దపులి దాడి చేసి చంపితినింది. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులు గురువారం గుర్తించారు. పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పులి సంచారాన్ని గుర్తిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.

September 26, 2024 / 12:58 PM IST

ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరోలారీ

NLR: ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైన ఘటన పెళ్లకూరు మండలం చిల్లకూరు జాతీయ రహదారి వద్ద గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి నుంచి నాయుడు పేటకు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన క్లీనర్ కార్తీక్(23) మృతి చెందగా డ్రైవర్ వినోద్ బాబు, మరో క్లీనర్ కునాల్ కుమార్‌కు గాయాలయ్యాయి.

September 26, 2024 / 11:50 AM IST

జార్ఖండ్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

జార్ఖండ్ బొకారోలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. తుప్కాడిహ్.. రాజబెరా సెక్షన్ల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పి రెండుగా విడిపోయింది. దాని రెండు వ్యాగన్లు బోల్తా పడ్డాయి. దీంతో డౌన్‌లైన్ ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. రైలు అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పట్టాలు తప్పిన వ్యాగన్లును పక్కకు తొలగించి ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియ...

September 26, 2024 / 11:25 AM IST

వియ్యంకుడిని కత్తులతో దాడి చేసి హత్య

TG: నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. మోపాల్ మండలం కంజరలో ఓ వ్యక్తి తన వియ్యంకుడిని కత్తులతో కిరాతకంగా నరికి చంపాడు. భవిత అనే వివాహిత ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. అయితే భవిత మృతికి ఆమె భర్త గోవర్ధన్ కారణమంటూ అత్త ఇంటిపై భవిత తండ్రి సత్యనారాయణ దాడికి వెళ్లాడు. గోవర్ధన్ ఇంట్లో లేకపోవడంతో అతని తండ్రి నరహరిపై కత్తులతో దాడి చేసి నరికి హత్య చేశాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

September 26, 2024 / 10:46 AM IST

భీమవరంలో గుర్తుతెలియని వృద్ధుడు మృతి

ELR: భీమవరంలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో గురువారం గుర్తుతెలియని వృద్ధుడు (60) ప్రమాదవశాత్తూ కాలు జారి కిందపడి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని వివరాల కోసం భీమవరం వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడిని గుర్తించిన వారు భీమవరం వన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

September 26, 2024 / 10:44 AM IST

వియ్యంకుడిని కత్తులతో దాడి చేసి హత్య చేసిన బంధువులు

NZB: మోపాల్‌ మండలం కంజరలో దారుణం జరిగింది. గోవర్థన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న యువతి భవిత ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. భవిత మృతికి గోవర్థన్‌ కారణమని భవిత తండ్రి సత్యనారాయణ అత్త ఇంటిపై దాడికి వెళ్లాడు. గోవర్థన్‌ ఇంట్లో లేకపోవడంతో అతని తండ్రి నరహరిని సత్యనారాయణ కత్తులతో నరికి చంపేశాడు.

September 26, 2024 / 10:01 AM IST