టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎంపీ అర్వింద్ ల మధ్య వార్ కొనసాగుతోంది. ఇటీవల అర్వింద్… కవితపై కామెంట్స్ చేశారనే కారణంతో…. ఆయన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఈ విషయం తీవ్ర దుమారం రేపింది. తన జోలికొచ్చి.. ఓవర్ గా మాట్లాడితే చెప్పుతో కొడతానని కవిత్ వార్నింగ్ ఇవ్వగా.. తగ్గేదే లేదంటూ అర్వింద్ కౌంటర్ ఎటాక్ కొనసాగించారు. ఈలోపు వేరే ఇష్యూలు తెరపై...
ప్రస్తుతం సమంత కండీషన్ ఎలా ఉందోనని ఆందోళన పడుతున్నారు ఆమె అభిమానులు. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్.. యశోద సినిమా ప్రమోషన్లో భాగంగా కన్నీటి పర్యతంమైన సంగతి తెలిసిందే. అప్పుడే సమంత ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే ఆ తర్వాత సామ్ ఎలా ఉంది.. ఆమె ఆరోగ్యం కుదుట పడిందా.. అని ఆరా తీస్తున్నారు. కానీ ఆమె హెల్త్ అప్టేట్ మాత్రం బయటికి రావడం లేదు. ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం రకరకాల వార్తలు హల్ చల్ [...
మహిళలను కించ పరుస్తూ చేస్తున్న కామెంట్స్ కి బాబా రాందేవ్ బాబా క్షమాపణలు చెప్పారు. మహిళల దుస్తులపై రాందేవ్ బాబా చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయనకు మహారాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాందేవ్ బాబా క్షమాపణ లేఖ నేడు విడుదల చేశారు. మహిళలను కించపర్చాలన్న ఉద్దేశం తనకు అస్సలు లేదని, తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడినట్లయితే తనను క్షమించాలని ఆయన కోరారు. గత శుక్రవారం మహారాష్ట్రలోని ఠ...
కోలీవుడ్ స్టార్ ఇళయ దళపతి విజయ్ హీరోగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారిసు’ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. తెలుగులో ‘వారసుడు’గా ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా థియేటర్ల వి...
‘ఆర్ఆర్ఆర్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత.. స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ‘ఆర్సీ15’ ప్రాజెక్ట్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం ఈ సినిమా న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా పై మెగాభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా.. గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు శంకర్. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏ దర...
టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఆ పార్టీకి ఊహించని షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయన టీడీపీని వీడి… వైసీపీ లేదా.. జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1వ తేదీన గంటా పుట్టిన రోజున వేడుకల తర్వాత తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీ మార్పు విషయాన్ని తన సన్నిహితులతో చర్చిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో సన్నిహిత సంబంధాలు...
యోగా గురు బాబా రామ్ దేవ్…. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిత్యం ఏదో ఒక వివాదంలో తలదూర్చే ఆయన తాజాగా… మహిళలపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. మహిళలు దుస్తులు వేసుకోకపోయినా బాగుంటారని బాబా రామ్‌దేవ్ పేర్కొన్నారు. మహిళల గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. మహారాష్ట్రలోని పతంజలి యోగపీఠం, ముంబైకి చెందిన మహిళల పతంజలి యోగ సమితి సంయుక్తంగా యోగ...
హైదరాబాద్‌లోని ప్రఖ్యాత చారిత్రక కట్టడం చార్మినార్ దగ్గర బాంబు పెట్టినట్టుగా ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. చార్మినార్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. చార్మినార్ పరిసరాల్లో దాదాపు గంట సేపటి నుంచి బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు. చార్మినార్ దగ్గర ఫుట్‌పాత్‌లపై షాపులను కూడా తొలగించారు. ఘటనాస్థలికి చేరుకున్న బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ప...
ఇండోనేషియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ఈ సంఘటనలో 44 మంది దుర్మరణం చెందగా మరో 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రిక్టర్ స్కేలు పై దీని తీవ్రత 5.6గా గుర్తించారు. భూకంపం కారణంగా ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులే ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. భూకంపం సంభవించే సమయంలో జనాలు పరుగులు తీశారు. కొన్ని ఇళ్లు కూలిపోయాయి. కొన్ని భవనాలు కుంగిపోయాయి. అధికార యంత్రాంగం రంగంలో దిగింది. సహా...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీలో పోలీసులు కేసు పెట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. ఇటీవల గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటం గ్రామంలో రహదారి అభివృద్ధి పేరుతో ప్రభుత్వం కొన్ని ఇళ్ల అక్రమ ఆక్రమణల విషయంలో కూల్చివేతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే… ఈ విషయంలో పవన్ చాలా సీరియస్ గా స్పందించారు. అసలు ఇవి ఆక్రమణలు కా...
ఏపీ సీఎం జగన్ ని చూసి… తెలంగాణ సీఎం కేసీఆర్ నేర్చుకోవాలని బీజేపీ నేత లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. రేపు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో… ప్రధాని సభ ఏర్పాట్లను లక్ష్మణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కెసిఆర్ రేపటి కార్యక్రమానికి హాజరు కావాలని రాష్ట్ర బిజెపి తరఫున కోరుతున్నామని… సమాఖ్య స్పూర్తి ని మోడీ గౌరవిస్తున్నారని పేర్కొన్నారు. బిజెపి ...
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నళినితో పాటు మరో ఐదుగురు దోషులను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. వీరిని విడుదల చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం ఇంతకు ముందే సుముఖతను వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని రాష్ట్ర గవర్నర్ కు కూడా తెలియజేసింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు తన ఆదేశాలను జారీ చేసే సమయంలో కూడా గుర్తు చేసింది. వీరి విడుదలకు సోనియాగాంధ...
ప్రధాని నరేంద్రమోదీ… తెలుగు రాష్ట్రాల పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. మోదీ.. ఇక్కడకు వస్తుంటే…. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఢిల్లీ పర్యటనకు బయలుదేరుతుండటం గమనార్హం. కేసీఆర్ శుక్రవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వెంట పలువరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని సమాచారం. శుక్రవారం నుంచి దాదాపు వారం రోజులు కేసీఆర్ ఢిల్లీలోనే ఉ...
మాల్దీవుల్లో ఘోర అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో… 11మంది ప్రాణాలు కోల్పోగా… వారిలో 9మంది భారతీయులు కూడా ఉండటం గమనార్హం. మాల్దీవుల రాజధాని మాలేలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విదేశీ కార్మికులు నివసిస్తున్న భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి 12.30 గంటలప్పుడు...
టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ఇటీవలె ‘కృష్ణ వింద్ర విహారి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా తన పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు నాగశౌర్య. ప్రస్తుతం తాను ఎవరితోనూ డేటింగ్‌లో లేనని.. కానీ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి.. తెలుగు అమ్మాయి అంటూ చెప్పాడు. దాంతో త్వరలోనే శౌర్య పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమనుకున్నారు. అనుకున్నట్టే ఇప్పుడు పెళ్లికి రెడీ అయిపోయాడు నాగ...