»Delhi Excise Policy Scam Supreme Court To Hear Plea Of Brs Mlc K Kavitha
Delhi excise policy scam: నేడు కవిత పిటిషన్ విచారణ
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ బి అర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్ ను ఈ రోజు (27, సోమ వారం) సుప్రీం కోర్టు విచారించనుంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ బి అర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్ ను ఈ రోజు (27, సోమ వారం) సుప్రీం కోర్టు విచారించనుంది. ఈ స్కాంలో ఈడీ తనకు నోటీసులు జారీ చేయడాన్ని కవిత తన పిటిషన్లో సవాల్ చేశారు. అలాగే ఈడీ తనపైన తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కూడా అంతకు ముందు విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ తనకు పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం జారీ చేసిన నోటీసులు సీఆర్పీసీ సెక్షన్ 160కి విరుద్ధంగా ఉన్నాయని, వాంగ్మూలం నమోదు చేసేప్పుడు న్యాయవాది సమక్షంలో వీడియో చిత్రీకరణకు ఉత్తర్వులు జారీ చేయాలని కవిత ఆ పిటిషన్లో కోరారు.
ఫోన్ను స్వాధీనం చేసుకొని, జారీ చేసిన జప్తు నోటీసులను రద్దు చేయడం, ఫోన్ను సీజ్ చేయడం చెల్లదని ఆదేశాలు ఇవ్వాలని, ఈ పిటిషన్ను నళినీ చిదంబరం వర్సెస్ ఈడీ కేసుకు జత చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. శుక్రవారం విచరించవలసి ఉండగా.. ఆ తర్వాత నేటికీ వాయిదా వేసింది.
కాగా కవిత ఇప్పటికీ మూడు రోజులు ఈడీ ఎదుట విచారణకు హాజరు అయ్యారు. నేడు కోర్టు ఆదేశాల అనంతరం ఈడీ ఏం చేస్తుంది.. కవిత పిటిషన్ పైన సుప్రీం కోర్టు ఏం చెబుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.