తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ సంచార ప్రచార వాహనాలు ఔరంగబాద్ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించారు. ఈ ప్రచార రథాలకు మరాఠా ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు.
అమ్మాయిలను (మోడల్స్) వ్యభిచారంలోకి దింపుతున్నారనే ఆరోపణలపై భోజ్‌పురి నటి సుమన్ కుమారి(Suman Kumari)(24)ని ముంబై పోలీసులు(mumbai police)అరెస్టు చేశారు. ఆ క్రమంలో ముగ్గురు మోడల్‌లను పోలీసులు రక్షించారు.
మధుమేహం(diabetes) ఉన్నవారు తీపి రుచిగల మామిడి(mango) పండును తినాలా లేక వద్దా అనే విషయంపై ఎల్లప్పుడూ కలవరపడతారు. అయితే మామిడి షుగర్ స్థాయిలను పెంచదు. పండిన మామిడి చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఈ క్రమంలో వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
తొలగించిన పాఠ్యాంశాన్ని యథావిధిగా పాఠ్య పుస్తకాల్లో ఉంచాలని బ్రేక్ త్రూ సైన్స్ సొసైటీ డిమాండ్ చేసింది. విద్యను కాషాయీకరణ చేసే కుట్రలో భాగంగా శాస్త్రీయ దృక్పథం కలిగిన పాఠ్యాంశాలు తొలగిస్తున్నారని ఆరోపించింది. ఇలాంటివి తొలగిస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య కొరవడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఏజెంట్ మూవీ మంచి టెక్నికల్ వాల్యూస్ ఉన్న చిత్రమని అంటున్న డీఓపీ రాసూల్ తో హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ మీ కోసం
పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో ఎంపీగా అనర్హత వేటు పడిన కొద్దిరోజుల తర్వాత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) శనివారం తన అధికారిక బంగ్లా(Official Bungalow)ను ఖాళీ చేసే అవకాశం ఉంది. మరోవైపు అతని వస్తువులను అతని అధికారిక నివాసం నుంచి 10 జన్‌పథ్‌లోని అతని తల్లి సోనియా గాంధీ ఇంటికి ఇప్పటికే మార్చారు.
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్(Prabhas), కృతి సనన్(Kriti Sanon) యాక్ట్ చేసిన ఆదిపురుష్(Adipurush) చిత్రం నుంచి మరో అప్ డేట్ వచ్చేసింది. జై శ్రీ రామ్ లిరికల్ మోషన్ పోస్టర్ వీడియోను ఈ మేరకు చిత్ర బృందం రిలీజ్ చేసింది. వీడియోలో జై శ్రీ రామ్ అంటూ వస్తున్న ఆడియో సాంగ్ అభిమానుల్లో గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
అధికార పార్టీ బీఆర్ఎస్ (BRS Party) నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల్లో అపశ్రుతులు చోటు చేసుకుంటున్నాయి. ఖమ్మం జిల్లాలో (Khammam District) ఘోర ప్రమాదంలో కార్యకర్తలు మృతి చెందిన సంఘటన మరువకముందే మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఓ కార్యకర్త గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. దీంతో బీఆర్ఎస్ పార్టీలో విషాదం అలుముకుంది. ఈ సంఘట...
దేశంలోని మొట్టమొదటి వాణిజ్య లిథియం అయాన్ సెల్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని బెంగళూరు(Bengaluru)లో నిన్న ప్రారంభించారు. లాగ్9 మెటీరియల్స్(Log9 Materials) బ్యాటరీ-టెక్నాలజీ స్టార్టప్ ఈ మేరకు మొదలుపెట్టింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేలా చర్యలు తీసుకున్నారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
కేసీఆర్ ను పంపిద్దామా? వద్దా?’ అని హరీశ్ రావు ప్రశ్నించారు. దీనికి కార్యకర్తలు ముక్తకంఠంతో ‘వద్దు.. వద్దు’ అని నినాదాలు చేశారు. ‘మళ్లీ మీకు కేసీఆర్ కావాలా? ’ అని హరీశ్ ప్రశ్నించగా.. ‘కావాలి.. కావాలి’ అంటూ కార్యకర్తలు కోరారు.
సికింద్రాబాద్-తిరుపతి(Secunderabad-Tirupati) వందే భారత్ రైలు(Vande Bharat train)కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అనేక మందికి టిక్కెట్లు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 8 బోగీలను 16కు పెంచనున్నట్లు తెలుస్తోంది.
యూపీ(uttar pradesh)లోని హమీర్‌పూర్(hamirpur) జిల్లాలో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. కారులో వెళ్తున్న వ్యక్తికి హెల్మెట్ ధరించలేదని పోలీసులు వెయ్యి రూపాయల చలాన్ నోటీస్ పంపించారు. అంతేకాదు ఆ తర్వాత అతను ఫైన్ కూడా కట్టినట్లు తెలుస్తోంది. ఇది తెలిసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీమ్ మారినా, జెర్సీ మారినా, ఆటగాళ్లు మారినా సన్ రైజర్స్ ఫేట్ మాత్రం మారలేదనే చెప్పాలి. గత రెండేళ్లుగా సన్ రైజర్స్(SRH) సత్తా చాటలేకపోతోంది. ఈ సీజన్ లోనూ పేలవ ప్రదర్శనతో హైదరాబాద్ జట్టు వెనపడుతోంది. మధ్యలో ఓ రెండు మ్యాచ్ లు గెలిచి అభిమానుల్లో ఆశలు పెంచినా.. మళ్లీ శుక్రవారం జరిగిన మ్యాచ్ లో చెన్నై(CSK) చేతిలో చిత్తుగా ఓడిపోయింది.
కుక్కల దాడుల్లో 18 నెలల చిన్నారి కన్నుమూసిన ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.