భోపాల్ సీఎం ఇంటినివాసం వద్ద మూత్ర విసర్ణన బాధితుడి కాళ్లు కడిగి క్షమాపణలు చెప్పిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.
ట్విట్టర్‌కు పోటీగా థ్రెడ్స్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ప్లేస్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంది. దీనిని మెగా సంస్థ రూపొందించింది. కొన్ని గంటల్లోనే మిలియన్ల మంది ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. త్వరలోనే ఇది ట్వీట్టర్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలువనుంది.
వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. తమ దేశం అయిన కైలాస దేశ ప్రధానిగా నటి రంజితను నియమించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రకటన సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలకు న్యాయమూర్తులను మార్చుతూ కొలీజియం సిఫారసు చేసింది. ఏపీ, తెలంగాణకు కూడా సీజేలను మార్చుతూ ఉత్తర్వులు వెలువడ్దాయి.
ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధి హామీలో కొత్తగా 23 పనులను చేర్చుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అలాగే త్వరలోనే బకాయిలు ఉన్న కూలీలకు వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందని అధికారులు తెలిపారు.
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదంలో 27 మంది దుర్మరణం చెందారు. మరో 17 మంది ఆస్పత్రిపాలయ్యారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
ఈరోజు(july 6th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
టీమిండియా ఆగస్టులో వెస్టిండీస్‌తో తలపడనుంది. టీ20 సిరీస్ జరగనున్న నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.
పవన్ తన మూడో భార్య అనా కొణిదెలకు విడాకులు ఇచ్చినట్లు నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. వాటికి చెక్ పెడుతూ జనసేన ట్విట్టర్ వేదికగా పోస్ట్ షేర్ చేసింది.
తెలంగాణకు మరో 8 మెడికల్ కళాశాలలు మంజూరయ్యాయి. దీంతో తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు కానుంది. ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య కూడా మొత్తంగా 10 వేలకు చేరుకోనుంది.
జగన్ అక్రమాస్తుల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ కు నోటీసులు జారీ చేసింది.
ఆధార్ కార్డు, రేషన్ కార్డులను లింక్ చేసుకోవడానికి మరోసారి కేంద్రం గడువును పెంచింది. సెప్టెంబర్ 30, 2023లోగా ఆధార్, రేషన్ కార్డులు లింక్ చేసుకోవాలని సూచించింది.
ప్రవేశ్ శుక్లాపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదైంది. తాగిన మత్తులో ఊగుతూ ఆ వ్యక్తి ఆదివాసి యువకుడిపై మూత్ర విసర్జనకు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చంద్రయాన్ పేలోడ్ ఉన్న క్యాప్సూల్‌ను జీఎస్ఎల్వీ రాకెట్‌తో ఈ రోజు అనుసంధానం చేశారు. సతీశ్ ధావన్ సెంటర్‌లో రాకెట్‌కు చంద్రయాన్ క్యాప్సూల్‌ను ఫిక్స్ చేశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపికైన కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను పార్టీకి విధేయుడినని తెలిపారు. జులై 8న వరంగల్‌లో ప్రధాని మోదీ సమక్షంలో అధ్యక్ష బాధ్యతలను చేపడుతానని వెల్లడించారు.