హిమాచల్ ప్రదేశ్ వరదల్లో తెలుగు మెడికోలు ముగ్గురు చిక్కుకున్నారు. ఈ నెల 8వ తేదీన వారు స్నేహితులతో మాట్లాడారు. ఆ తర్వాత నుంచి వారి మొబైల్స్ స్విచ్ఛాఫ్ వస్తున్నాయి.
గుజరాత్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ మానవత్వం చాటిచెప్పింది. పరీక్ష సమయంలో చిన్నారి ఆలనపాలనా చూసి మానత్వం చాటుకుంది.
తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
అమరావతి రాజధాని కేసు విచారణను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు డిసెంబర్‌కు వాయిదా వేసింది.
నేపాల్‌లో ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పర్యాటకులతోపాటు పైలట్ చనిపోయారు.
టీ20 సిరీస్‌లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో టీమిండియా మహిళా జట్టు తలపడనుంది.
పాఠశాల బస్సు రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొనడంతో ఆరుగురు మృతిచెందారు. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు విచారణలో భాగంగా మరో 10 మందిని అరెస్ట్ చేసినట్లు సిట్ పోలీసులు వెల్లడించారు.
తిరుమలలో నేడు శ్రీవారి బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం సందర్భంగా టీటీడీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ ప్రకటన చేసింది.
ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, ఆంటిగ్వా, బార్బుడా ప్రాంతాల్లో రెండు భూకంపాలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై వాటి తీవ్రత 6.4, 6.6గా నమోదైందని అధికారులు తెలిపారు.
పెళ్లి బస్సు బోల్తా పడటంతో ఏడుగురు మృతి చెందారు. ఈ దారుణ ఘటన ఏపీలోని దర్శి వద్ద చోటుచేసుకుంది.
ఈరోజు(july 11th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరిరంగన్‌కు గుండెపోటు వచ్చింది. శ్రీలంక పర్యటనలో ఉండగా స్ట్రోక్ రాగా.. మెరుగైన చికిత్స కోసం బెంగళూర్ తరలిస్తున్నారు.
కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి భూమి కేటాయింపుపై హైకోర్టులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్ దాఖలు చేసింది.
కింగ్ ఖాన్ ఈజ్ బ్యాక్ అంటూ.. పఠాన్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేశాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. అదే జోష్‌లో అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌ని పరుగులు పెట్టిస్తున్నాడు షారుఖ్. సెప్టెంబర్‌లో జవాన్‌గా రాబోతున్న ఈ స్టార్ హీరో.. ఆ తర్వాత డుంకీ(Dunki)గా రాబోతున్నాడు. అయితే షారుఖ్ డుంకీకి 155 కోట్లు అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా సింగిల్ లాంగ్వేజ్‌లో అంటే మామూలు విషయం కాదంటున్నారు.