ఆగస్టు 15, 2003: అప్పటి ప్రధానమంత్రి, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి చంద్రయాన్ కార్యక్రమాన్ని ప్రకటించారు. అక్టోబర్ 22, 2008: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-1 టేకాఫ్. నవంబర్ 8, 2008: చంద్రయాన్-1 చంద్రుని పరిధిలోకి ప్రవేశం నవంబర్ 14, 2008: చంద్రుని ప్రభావం ప్రోబ్ చంద్రయాన్-1 నుంచి ఎజెక్ట్ చేయబడింది. దక్షిణ ధ్రువం దగ్గర కూలిపోయింది. ఆగస్ట్ 28, 2009: ఇస్రో ప్రకారం చంద్రయ...
దివంగత నటి శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ. ఆమె బాలీవుడ్ లో తెరంగేట్రం చేసి దాదాపు ఐదు సంవత్సరాలు అవుతున్నా, చెప్పుకోతగిన హిట్ మాత్రం ఆమెకు దక్కలేదు. దీంతో తన దృష్టి దక్షిణాదిపై పెట్టింది. సౌత్ లో తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి కసరత్తులు మొదలుపెట్టింది.
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావుతో బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా భేటీ అయ్యారు. వీరు ఏ అంశాలపై చర్చలు జరిపారని ఇరు పార్టీనేతల్లో ఆసక్తి నెలకొంది.
రెమో, డాక్టర్, ప్రిన్స్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం మహావీరుడు ఈ రోజు థియేటర్లో విడుదలైంది. వినుత్నమైన కథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఏమేర నచ్చిందో తెలుసుకుందాం.
కొందరు మహిళలల్లో నేర ప్రవృతి పెరుగుతోంది. భర్తలు ఒక మాట అంటే పడటం లేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ మహిళా అయితే ఏకంగా భర్తపై దాడి చేసి హతమార్చింది.
దోమలగూడ గ్యాస్ లీక్ ఘటనలో మరో ముగ్గురు చనిపోయారు. రెండురోజుల క్రితం ఓ బాలిక మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్(pawan kalyan) పోటీ చేసే స్థానంలో వాలంటీర్ ను నిలబెడతామని ఏపీ మంత్రి జోగి రమేష్(jogi ramesh) పేర్కొన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే పవన్ ఒంటరిగా మీ పార్టీ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. పవన్ ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా కూడా వైసీపీ తరఫున ఓ వాలంటీర్ ను నిలబెట్టి చిత్తు చిత్తుగా ఓడిస్తామని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో అసలు పవన్ కు ఏపీలో తిరిగేందుకు అర్హత లేదని ఆరోపించారు. [&he...
సాధారణంగా పక్షులకు మాత్రమే వచ్చే బర్డ్‌ఫ్లూ ఇప్పుడు క్షిరదాల్లో వస్తుండడంతో మనుషులు కూడా జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అప్రత్తంగా ఉండాలని సూచించింది.
దేశవ్యాప్తంగా వరదల కారణంగా 145 మంది మృతి చెందారు. కొండచర్యలు విరిగిపడుతుండడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. ఢిల్లీలో జూలై 16 వరకు పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
ఇస్రో మూడవ మూన్ మిషన్ మరికొన్ని గంటల్లో ప్రయోగించనున్నారు. చంద్రయాన్-3(Chandrayaan 3) ఈరోజు (జూలై 14, 2023) మధ్యాహ్నం 2:35 గంటలకు ప్రయోగించనున్నారు. ఇస్రో అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
థాయ్‌లాండ్‌లో జరుగుతున్న 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2023లో రెండో రోజైన గురువారం భారత అథ్లెట్లు మూడు స్వర్ణాలను గెలుచుకున్నారు. దీంతోపాటు కాంస్య పతకం కూడా కైవసం చేసుకున్నారు. వీరిలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతి కూడా ఉండటం విశేషం.
ప్రముఖ కేరళ అస్ట్రాలజీ శివ నర్సంహ తంత్రి చెప్పినట్లు ఈ రెమెడీ చేస్తే గురు బలం విపరీతంగా పెరుగుతుందని అంటున్నారు. అది ఎలానో ఇప్పుడు చుద్దాం.
యూత్ ను ఆకర్షించే మరో ట్రైయాంగిలం కథతో ఈ వారం మన ముందుకు వచ్చిన చిత్రం బేబీ. చిన్న సినిమాలు అయినా ప్రేక్షకులు మెచ్చేలా చేస్తూ వెండితెరపై అందరిని ఆకర్షిస్తున్న హీరో ఆనంద్ దేవరకొండ, యూట్యూబ్ వెబ్ సిరీస్ నుంచి సిల్వర్ స్క్రీన్ పై అవకాశాన్ని చేజిక్కించుకున్న వైష్ణవి చైతన్య మరో నటుడు విరాజ్ అశ్విన్ తదితరులు నటించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కేరళలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అంబులెన్స్ ను ఢీ కొట్టిన మంత్రి కాన్వయ్ ఘనటలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ క్రమంలో అతను ఆపకుండా వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో మార్గానికి రంగం సిద్ధమైంది. ఈ రూట్లో మెట్రో నిర్మించేందుకు టెండర్ రిలీజ్ చేయగా రెండు ప్రముఖ సంస్థలు మాకంటే మాకే ఇవ్వాలని పోటీకి దాగాయి. వాటిలో L&T లిమిటెడ్, NCC లిమిటెడ్ ఉన్నాయి. మరి వీటిలో చివరికి ఏ సంస్థ ఈ ప్రాజెక్టును దక్కించుకుంటుందో చూడాలి.