»Two Top Companies L T And Ncc Are Competing For Construction Of Shamshabad Hyderabad Metro
Shamshabad metro: నిర్మాణం కోసం రెండు అగ్రసంస్థలు పోటీ
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో మార్గానికి రంగం సిద్ధమైంది. ఈ రూట్లో మెట్రో నిర్మించేందుకు టెండర్ రిలీజ్ చేయగా రెండు ప్రముఖ సంస్థలు మాకంటే మాకే ఇవ్వాలని పోటీకి దాగాయి. వాటిలో L&T లిమిటెడ్, NCC లిమిటెడ్ ఉన్నాయి. మరి వీటిలో చివరికి ఏ సంస్థ ఈ ప్రాజెక్టును దక్కించుకుంటుందో చూడాలి.
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో కోసం పోటీ మొదలైంది. ఈ మెట్రో పనుల కోసం రూ.5,688 కోట్ల ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ & కన్స్ట్రక్షన్ (EPC) టెండర్ కోసం టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలైన ఎల్ అండ్ టి లిమిటెడ్, ఎన్సిసి లిమిటెడ్ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. గురువారం రైల్ భవన్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) ఈ మేరకు టెండర్‌ను ప్రకటించాయి. రెండు కంపెనీలు తమ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అనుభవం, టెక్నికల్, ఫైనాన్షియల్ బలాబలాలు, ఆడిట్ చేయబడిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు మొదలైనవాటిని హైలైట్ చేస్తూ భారీ డాక్యుమెంట్లను సమర్పించాయి. దీంతోపాటు బ్యాంక్ గ్యారెంటీల రూపంలో ఒక్కొక్కటి రూ.29 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్లను దాఖలు చేసినట్లు హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
బిడ్ డాక్యుమెంట్లు, వారి అర్హత అర్హత ప్రమాణాలు, ప్రతిపాదిత నైపుణ్యం కలిగిన మానవశక్తి, యంత్రాలు, నిర్మాణ పద్దతి, నిర్మాణ షెడ్యూల్, వివిధ పౌర నిర్మాణాలు, ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్ సిస్టమ్‌ల రూపకల్పన ప్రాతిపదిక నివేదికలు మొదలైన వాటికి సంబంధించిన వివరాలతో కూడిన బిడ్ డాక్యుమెంట్లను నిపుణులు పరిశీలిస్తారు. GC(Systra నేతృత్వంలోని జనరల్ కన్సల్టెంట్స్), HAML యొక్క సీనియర్ సాంకేతిక అధికారులు చివరికి ఫైనల్ చేయనున్నారు. బిడ్ల మూల్యాంకనానికి దాదాపు 10 రోజుల సమయం పడుతుందని, హెచ్ఏఎంఎల్ మూల్యాంకనం, సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు ఆయన వెల్లడించారు.