Anakapalle నన్నే ఆపుతారా అంటూ మంత్రి అమర్నాథ్ కోపం.. దెబ్బకు ఇద్దరు బదిలీ

మంత్రి గారి కోపానికి ఇద్దరు అధికారులపై వేటు పడింది. అయితే ఈ వ్యవహారం విశాఖ జిల్లాలో చర్చనీయాంశమైంది. మంత్రిగా పెత్తనం.. అధికార దర్పం బాగానే ప్రదర్శిస్తున్న మంత్రి విశాఖకు, రాష్ట్రానికి మంత్రిగా ఏమైనా మేలు చేయాలని స్థానికులు చెబుతున్నారు.

  • Written By:
  • Updated On - March 27, 2023 / 10:34 AM IST

దావోస్ పర్యటన, ఈ రేస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియా (Social Media)లో ట్రోలింగ్ (Trolling)కు గురయిన ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ (Gudivada Amarnath) మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి ఆయనలోని మరో రూపం బయటకు వచ్చింది. అమ్మవారి దర్శనానికి 45 నిమిషాల పాటు తనను వేచి ఉంచడంపై అతడికి ఆగ్రహం తెప్పించింది. మంత్రిని అయిన నన్నే వేచి ఉంచుతారా? అంటూ మండిపడ్డారు. దెబ్బకు మంత్రి ఆదేశాలతో ఆ ఆలయ అధికారులు (Endowment Officers) బదిలీ అయ్యారు. ఉద్యోగులను బదిలీ చేసి మంత్రి అమర్ నాథ్ తన కోపాన్ని తీర్చుకున్నారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో తీవ్ర దుమారం రేపుతున్నది.

Real Only Jubilee Hills మాజీ పోలీస్ అధికారి ఇంట్లో భారీ చోరీ.. ఖరీదైన దొంగ

అనకాపల్లి (Anakapalle)లోని నూకాంబిక అమ్మవారి ఆలయం (Nookambika Ammavari Temple) ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా ప్రసిద్ధిగాంచింది. కొత్త అమావాస్య పర్వదినం సందర్భంగా ఆలయంలో నెల జాతర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈనెల 22న జిల్లా మంత్రిగా అమర్ నాథ్ ఉత్సవాలకు హాజరయ్యాడు. ఆలయానికి మంత్రి రాగా ఆ సమయంలో ఆలయంలో నైవేద్యం నివేదన కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా దర్శనా (Darshan)లు నిలిపివేశారు. అమ్మవారికి ఏకాంత సేవ కావడంతో ప్రముఖులతో పాటు సాధారణ భక్తులను కూడా దర్శనానికి అనుమతించలేదు. దీంతో మంత్రి 45 నిమిషాల పాటు వేచి ఉన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. అయితే దర్శనం నిలిపివేసి తనను వేచి ఉంచడంపై మంత్రి అమర్ నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ముందుగా దర్శన సమయాలు తెలపలేదంటూ మండిపడ్డారు. ఈ విషయమై దేవాదాయ శాఖ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు.

Real Only Innocent దిగ్గజ నటుడు కన్నుమూత.. సీఎం, హీరోలు దిగ్భ్రాంతి

మంత్రి కోపం ప్రదర్శించడంతో ఉన్నత అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నూకాలమ్మ ఆలయ ఈవో చంద్రశేఖర్ ను బదిలీ చేస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు దేవాదాయ శాఖ ఇన్ చార్జ్ అధికారి బుద్ద నగేశ్ ను కూడా బదిలీ (Transfer) చేశారు. మంత్రి గారి కోపానికి ఇద్దరు అధికారులపై వేటు పడింది. అయితే ఈ వ్యవహారం విశాఖ జిల్లాలో చర్చనీయాంశమైంది. మంత్రిగా పెత్తనం.. అధికార దర్పం బాగానే ప్రదర్శిస్తున్న మంత్రి విశాఖకు, రాష్ట్రానికి మంత్రిగా ఏమైనా మేలు చేయాలని స్థానికులు చెబుతున్నారు.

Real Only షూటింగ్ లోనే Abortion అయ్యింది: విషాదం పంచుకున్న కేంద్ర మంత్రి