BRS MLC Kavitha: ముగిసిన కవిత ఈడీ విచారణ..16న మళ్లీ..
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. 9 గంటల పాటు కవితను ఈడీ అధికారులు విచారించారు. ఈ మేరకు ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. ఈడీ ఆఫీస్ నుంచి బయటికొచ్చిన కవిత ఢిల్లీలోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఇకపోతే కవిత తదుపరి విచారణపై ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదిన మరోసారి కవితను విచారించనున్నట్లు వెల్లడించింది.
బిఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఈడీ(ED) విచారణ ముగిసింది. 9 గంటల పాటు కవితను ఈడీ అధికారులు విచారించారు. ఈ మేరకు ఈడీ(ED) కార్యాలయం వద్ద భారీ బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. ఈడీ ఆఫీస్ నుంచి బయటికొచ్చిన కవిత(Kavitha) ఢిల్లీలోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఇకపోతే కవిత తదుపరి విచారణపై ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదిన మరోసారి కవితను విచారించనున్నట్లు వెల్లడించింది.
నేడు కవిత(Kavitha)ను మొత్తం ఐదు మందితో కూడిన బృందం విచారించింది. అందులో ఈడీ(ED)కి చెందిన ఒక జాయింట్ డైరెక్టర్, లేడీ డిప్యూటీ డైరెక్టర్, ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు. దాదాపు 9 గంటల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవితను ఈడీ(ED) ప్రశ్నించింది. విచారణ మధ్యలో సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకూ భోజన విరామ సమయం ఇచ్చింది.
సాయంత్రం 5 గంటలకు తిరిగి విచారణను ప్రారంభించిన ఈడీ(ED) కవితను ప్రశ్నించింది. కవిత(Kavitha) మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, విజయ్ నాయర్, మనీష్ సిసోడియా స్టేట్ మెంట్ల ఆధారంగా ఎమ్మెల్సీ కవిత(Kavitha)ను ఈడీ ప్రశ్నించింది. 16న గురువారం కవితను ఈడీ(ED) విచారణకు పిలిచింది.