»Minor Girl Shot At By Friend In Delhi Over Argument
Minor Girl Shot: ఢిల్లీలో మైనర్ బాలికను గన్తో కాల్చాడు
అమ్మాయిల పైన దాడులు ఆగడం లేదు (Crime Against Women). సోమవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మైనర్ బాలికను గన్ తో కాల్చిన (gun culture india) దారుణ సంఘటన చోటు చేసుకున్నది. ఈ సంఘటన దేశ రాజధానిలోని నంద నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది.
అమ్మాయిల పైన దాడులు ఆగడం లేదు (Crime Against Women). సోమవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మైనర్ బాలికను గన్ తో కాల్చిన (gun culture india) దారుణ సంఘటన చోటు చేసుకున్నది. ఈ సంఘటన దేశ రాజధానిలోని నంద నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. 16 ఏళ్ల బాలికను స్నేహితుడే కాల్చాడు. ఆమెకు చికిత్స అందిస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఈ సంఘటన రాత్రి గం.8.27 నిమిషాలకు చోటు చేసుకున్నది. వీరిద్దరు స్థానిక సుభాష్ పార్కుకు వచ్చారు. ఆ సమయంలో స్నేహితుడు కాశీం ఆమెను కాల్చాడు. నిందితుడి వయస్సు 19 ఏళ్లు ఉంటుంది. వీరిద్దరి మధ్య ఏదో విషమయై తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆవేశంతో ఊగిపోయి, గన్ తీసి కాల్చాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఏం జరిగిందనే విషయం ఆరా తీస్తున్నారు. గాయపడ్డ బాలికకు స్థానిక జీటీపీ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో వారిద్దరు స్నేహితులని వెల్లడైంది. ఓ అమ్మాయి విషయంలో ఖాసిమ్, గాయపడ్డ బాలిక మధ్య గొడవ జరిగిందని, ఈ క్రమంలోనే ఖాసిం తనను కాల్చాడని ఆమె చెప్పినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇదేమి మొదటిసారి కాదని, ఇంతకముందు కూడా ఓసారి ఇంటికి వచ్చి తనని ఇలాగే బెదిరించినట్లు తెలిపింది. ఆమె కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ను కూడా నమోదు చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
ఛత్తీస్ గఢ్ (chhattisgarh) బిలాస్ పూర్ లో (bilaspur) ఓ భర్త తన భార్యను (Husband kills wife) ముక్కలుగా నరికిన దారుణ సంఘటన వెలుగు చూసింది. ఆమె శరీర భాగాలను ఇంట్లోని నీళ్ల ట్యాంకులో (Water Tank) దాచి పెట్టాడు. ఈ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత వెలుగు చూసింది. తఖాత్ పూర్ గ్రామానికి చెందిన పవన్ అనే యువకుడు గీతాంజలి నగర్ లో నివసిస్తున్నాడు. సీసీటీవీ బిగించే పని చేస్తున్నాడు. కొద్ది సంవత్సరాల క్రితం సతి సాహు అనే యువతితో పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొన్నాళ్లుగా భార్య వ్యవహార శైలి పైన అనుమానం ఉన్న అతను ఆమెను హత్య చేయాలని భావించాడు. ముందే ప్లాన్ చేసుకొని, ఇద్దరు పిల్లలను స్వగ్రామంలో వదిలి పెట్టి వచ్చాడు. అనంతరం భార్యను హత్య చేసి, శరీరాన్ని ముక్కలు చేసి, ట్యాంకులో వేశాడు. ఇన్నాళ్లు ఎలాంటి అనుమానం రాలేదు. కానీ ఇటీవల ఓ దొంగతనం కేసులో అరెస్టయ్యాడు. ఇళ్లును తనిఖీ చేయగా, వాటర్ ట్యాంకులో మహిళ శరీర భాగాలు కనిపించాయి.