Upcoming telugu movies: ఈ వారం రిలీజ్ కానున్న చిత్రాలివే
సినీ అభిమానులను అలరించడానికి ఈ వారం కూడా మరికొన్ని చిత్రాలు వచ్చేశాయి. ఈ క్రమంలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఏంటీ? వాటిలో ఏ చిత్రాలు చూడాలి? ఆ సినిమాలకు దర్శకులు ఎవరు? అసలు ఈ సినిమాలకు వెళ్దామా వద్దా అనేది ఈ వివరాలను చూసి నిర్ణయించుకోండి.
సిని ప్రేక్షకులను సందడి చేసేందుకు ఈ వారం మరికొన్ని చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈ చిత్రాల విశేషాలను ఇక్కడ చుద్దాం.
మేమ్ ఫేమస్
టాలీవుడ్(Tollywood)లో థియేటర్లలోకి దూసుకొస్తున్న తాజాగా చిత్రం మేమ్ ఫేమస్ (Mem Famous Movie). అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మేమ్ ఫేమస్’. ఈ మూవీకి సుమంత్ ప్రభాస్ దర్శకత్వం(Director Sumanth Prabhash) వహించారు. ఈ నెల 26వ తేదీన థియేటర్లలో ఈ మూవీ విడుదల(Release) కానుంది. హీరో నాని(Hero Nani) ముఖ్య అతిథిగా ఈవెంట్ కు విచ్చేసి ట్రైలర్ ను విడుదల(Trailer Release) చేశారు.
మళ్లీ పెళ్లి
నరేష్-పవిత్ర కలిసి నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’(Malli pelli) చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ‘మళ్లీ పెళ్లి’ సినిమా మే 26న రిలీజ్ థియేటర్లలో కాబోతుంది . ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నరేష్ – పవిత్ర(Naresh – Pavitra ) కూడా పలు షోస్ కి అటెండ్ అవుతున్నారు.
#మెన్ టూ
#MeToo విప్లవం పేరుతో మహిళలు చేసిన ఫిర్యాదుల ఫలితంగా పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ చిత్రంలో చూపించనున్నారు. నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, రియా సుమన్, ప్రియాంక శర్మ, మౌర్య సిద్దవరం, కౌశిక్ ఘంటసాల, ఆశ్రిత, కార్తీక్ అడుసుమిల్లిమోర్ ఈ చిత్రంలో యాక్ట్ చేశారు. శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 26న థియేటర్లలో రిలీజ్ కానుంది.
రుద్రంగి
రుద్రంగి చిత్రంలో జగపతి బాబు, మమతా మోహన్‌దాస్, విమలా రామన్, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ తెలుగు చిత్రానికి అజయ్ సామ్రాట్ రచన, దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా మే 26న థియేటర్లలో విడుదల కానుంది.
2018 మూవీ
2018 కేరళ వరదల నేపథ్యంలో సాగే థ్రిల్లర్ మూవీ ఇది. విపత్తు పరిణామాలను ఎదుర్కొన్న అన్ని వర్గాల ప్రజల జీవితాలను విపత్తు నుంచి బయటపడటానికి ధైర్యవంతులు చేసిన సమిష్టి ప్రయత్నాలను ఈ చిత్రంలో చూపించారు. ఈ చిత్రం తెలుగులో మే 26న థియేటర్లలోకి రానుంది.
ఏలియన్స్ 2042
2042లో భూమిని గ్రహాంతరవాసులు ఆక్రమిస్తారు. వారు నీటిని దొంగిలించాలనుకున్నారు. వారిని ఓడించేందుకు చైనా మినహా ప్రపంచంలోని అన్ని దేశాలు తమ సైన్యాన్ని రంగంలోకి దించుతాయి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? గ్రహాంతరవాసులు మానవ జాతిని తమ ఆధీనంలోకి తీసుకుంటారా అనేది ఈ చిత్రం. ఈ మూవీ కూడా మే 26న థియేటర్లలోకి విడుదల అవనుంది.
గోవిందా భజ గోవిందా
గోవిందా భజ గోవిందా అనేది సూర్య తేజ, ప్రియా శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో నటించిన తెలుగు చిత్రం. ఈ చిత్రానికి సూర్యకార్తికేయ దర్శకత్వం వహించారు. ఈ మూవీ కూడా మే 26న రిలీజ్ కానుంది.
కరాళ
ఖలింగ రాజవంశంలో ఒక ఋషి తన జ్ఞానం, శక్తితో ఒక ప్రయోగం చేస్తాడు. ఆ పరిణామాలను గమనించిన తరువాత అతను దానిని ఒక పుస్తకంలో పాతిపెడతాడు. అయితే అసలు ప్రయోగం చేసినపుడు ఏమి జరుగుతుందనేది ఈ మూవీ స్టోరీ. ఈ సినిమా మే 26న విడుదల కానుంది.
ఇది కూడా చూడండి: Naresh: వామ్మో.. నరేష్ కు అన్ని వేల కోట్ల ఆస్తి ఉందా !