Suicide: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. కానీ ఆమె మృతదేహంపై 500పైగా గాయాల గుర్తులు ఉండటంతో కలకలం రేపింది. ఉన్నావ్‌లో నివాసం ఉంటున్న మీను కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఇటీవల ఈమె హాస్టల్ గదిలో ఊరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన స్థానికులు ఈమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. మార్గమధ్యలోనే చనిపోయింది. తర్వాత ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
పోస్టుమార్టం నివేదికలో ఊరివేసుకుని చనిపోయింది. కానీ ఆమె మృతదేహాంపై 500పైగా గాయాల గుర్తులు కనిపించడంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. చుట్టపక్కల ఉన్నవాళ్లను విచారించగా.. అలీగఢ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌తో మీను ప్రేమలో ఉందని చెప్పారు. ఆమెను ప్రేమించిన అతను మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. ఈ విషయం తెలిసి మీను ఎన్నిసార్లు కాల్ చేసిన అతను లిఫ్ట్ చేయలేదని మనస్తాపంతో తనని తాను దాడి చేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.