»Komatireddy Rajagopal Reddy Sawal Challenge To Kcr And Revanth Reddy
Komatireddy Rajagopal Reddy: దమ్ముంటే KTR, రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించాలి
నల్గొండ బీజేపీ నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy)..మంత్రి కేటీఆర్(ktr), రేవంత్ రెడ్డి(Revanth Reddy)లకు సవాల్(sawal) విసిరారు. తాను రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయానని ఆరోపించిన వీరు దమ్ముంటే నిరూపించాలని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల(tirumala) దేవుడి(god) మీద ప్రమాణం చేసి తాను అమ్ముడు పోలేదని కోమటి రెడ్డి అన్నారు. తనను ఓడించేందుకే తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు.
నల్గొండ బీజేపీ నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) మంత్రి కేటీఆర్(ktr), రేవంత్ రెడ్డి(Revanth Reddy)లకు సవాల్(sawal) విసిరారు. తాను రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయానని తప్పుడు ప్రచారం చేసి మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) పార్టీ గెలిచిందని పేర్కొన్నారు. అంతేకాదు కాంగ్రెస్(congress), బీఆర్ఎస్(BRS) పార్టీలు ఒక్కటై తనను ఓడించాయన్నారు. ఆ క్రమంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తనను ఓడించారని వెల్లడించారు. కానీ నైతికంగా బీజేపీతోపాటు తాను గెలిచానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తప్పకుండా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలోని తిరుమల తిరుపతి ఆలయాన్ని దర్శించుకున్న సందర్భంగా వెల్లడించారు. అంతేకాదు తెలంగాణ(telangana)లో కేసీఆర్(KCR) పాలన పోవాలి..బీజేపీ(BJP) ప్రజా పాలన రావాలని శ్రీవెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు చెప్పారు.
మరోవైపు తిరుమల(tirumala) దేవుడి మీద ప్రమాణం చేసి తాను అమ్ముడు పోలేదని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) స్పష్టం చేశారు. తాను 18 వేల కోట్ల రూపాయలకు అమ్మడు పోయినట్లు ఆరోపణలు చేసిన మంత్రి కేటీఆర్(KTR), రేవంత్ రెడ్డి ఆధారాలతో సహా దమ్ముంటే రుజువు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కొలేక తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. తన 55 ఏళ్ల జీవితంలో ఎప్పుడూ కూడా డబ్బుల కోసం అమ్ముడు పోలేదన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని ఆరోపించారు. కుటుంబ, నియంత పాలన కొనసాగుతుందని గుర్తుచేశారు. అలాంటి ప్రభుత్వాన్ని దించాలని ప్రజలకు(people) సూచించారు.
ఇంకోవైపు ఢిల్లీ మద్యం కేసు(delhi liquor case)లో కవిత(kavitha) భాగస్వామిగా ఉన్నట్లు ఆరోపించారు. తెలంగాణలో సంపాదించిన అవినీతి సొమ్మతో కవిత ఢిల్లీలో 600 షాపులు తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో రేపో మాపో కేసీఆర్(kcr) గారాల కుమార్తె కవిత జైలు పాలుగాక తప్పదని రాజగోపాల్ రెడ్డి అన్నారు.