కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్ష(Karnataka BJP State President) పదవికి దక్షిణ కన్నడ ఎంపీ నళిన్ కుమార్ కటీల్(nalin kumar kateel) శనివారం రాజీనామా సమర్పించారు. 2023 మేలో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కటీల్ రాజీనామా చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. “బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నా రెండేళ్ల పదవీకాలం ముగిసింది. నేను రాజీనామా చేశానని పేర్కొన్నారు. తన రాజీనామాను సమర్పిస్తూ కటీల్ నేను పంపవలసింది పంపాను. ఇప్పుడు నిర్ణయం పార్టీ హైకమాండ్ చేతిలో ఉందని ఆయన వెల్లడించారు.
దక్షిణాదిలో బీజేపీ అధికారాన్ని కాంగ్రెస్ చేతిలో కోల్పోవడంతో కటీల్ తన పదవికి రాజీనామా(resign) చేశారు. కర్ణాటకలో 224 సభ్యుల అసెంబ్లీలో 136 సీట్లు గెలుచుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కర్నాటకలో విజయం సాధించింది. కానీ బీజేపీ కేవలం 65 సీట్లకే పరిమితమైంది. ఇప్పటికే తన పదవీకాలం పూర్తయిందని, భర్తీ ప్రక్రియ ప్రారంభమైందని బళ్లారిలో కటీల్ చెప్పడంతో గందరగోళం మొదలైంది. ఓటమికి గల కారణాలపై ఇప్పటికే పార్టీ నేతలకు వివరించినట్లు దక్షిణ కన్నడ ఎంపీ కటీల్ తెలిపారు.