»Jana Sena President Pawan Kalyan Complains To Sp Against Srikalahasti Ci Anju Yadav
Pawan Kalyan: సీఐ అంజూయాదవ్ పై SPకి ఫిర్యాదు చేసిన జనసేనాని
తిరుపతికి చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. భారీ ర్యాలీతో జిల్లా ఎస్పీని కలిసి శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు.
Jana Sena president Pawan Kalyan complains to SP against Srikalahasti CI Anju Yadav
Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్(Pawan Kalyan) తిరుపతి(Tirupathi) చేరుకున్నారు. శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్(Anju Yadav)పై తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డికి ఆయన ఫిర్యాదు చేశారు. గన్నవరం(Gannavaram) విమానాశ్రయం నుంచి రేణిగుంట(Renigunta) చేరుకున్న పవన్ అక్కడి నుంచి తిరుపతికి వచ్చారు. జనసేన కార్యకర్తలతో కలిసి భారీగా ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అక్కడ వినతిపత్రం సమర్పించారు. ఇటీవల శ్రీకాళహాస్తి(Sreekaalhasti)లో నిరసన తెలుపుతున్న జనసేన కార్యకర్త కట్టే సాయిపై స్థానిక సీఐ అంజూయాదవ్ చేయిచేసుకున్నారు. జనసేన పార్టీ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తిరుపతి చేరకొని జిల్లా ఎస్పీని కలిసి సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.