»Historic Step To Unite Opposition Rahul Gandhi Nitish Kumar Meet
Rahul Gandhi meets Nitish Kumar: చారిత్రక అడుగు.. నితీష్ కుమార్-రాహుల్ భేటీ
ఈ రోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, బీహార్ సీఎం నితీష్, బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ చైర్ పర్సన్ తేజస్వి యాదవ్ సమావేశమయ్యారు.
దేశంలో భావజాల పోరులో విపక్షాల ఐక్యత దిశగా ఈ రోజు చారిత్రాత్మక అడుగు పడిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు (Congress leader Rahul Gandhi). కలిసి నిలబడి.. కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ రోజు ఆయన బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీష్ కుమార్ ను కలిశారు (bihar chief minister nitish kumar). 2024 సార్వత్రిక ఎన్నికలకు (2024 lok sabha elections) ముందు ఇది కీలక అడుగు అని చెప్పవచ్చు. బీజేపీకి (united Opposition front) వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసే లక్ష్యంలో భాగంగా కాంగ్రెస్, జనతా దళ్, ఆర్జేడీ టాప్ లీడర్స్ అందరూ ఈ రోజు ఢిల్లీలో సమావేశమయ్యారు (top leaders of the Congress, Janata Dal (United) (JDU) and Rashtriya Janata Dal (RJD) met in Delhi).
ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, బీహార్ సీఎం నితీష్, బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ చైర్ పర్సన్ తేజస్వి యాదవ్ పాల్గొన్నారు. వీరితో పాటు జేడీయూ ప్రెసిడెంట్ రాజీవ్ రంజన్ సింగ్, ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ… ఇది చారిత్రాత్మక సమావేశం అన్నారు. వచ్చే ఎన్నికల్లో విపక్షాలను ఏకం చేయడానికి ఇదో ముందడుగు అన్నారు. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు చారిత్రాత్మకమైన అడుగు పడిందని రాహుల్ అన్నారు. ఇది ఒక ప్రక్రియ అని, ఇది దేశం పట్ల ప్రతిపక్ష విజన్ ను వెల్లడిస్తుందన్నారు. బీహార్ సీఎం నితీష్ మాట్లాడుతూ… వీలైనన్ని పార్టీలను ఏకతాటి పైకి తీసుకు వచ్చి కలిసి పనిచేయాలనే ప్రయత్నం అన్నారు. ఈ భేటీకి ముందు నితీష్ కుమార్ ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ను కలిశారు. ఆయన ప్రస్తుతం మీసా భారతీ నివాసంలో కోలుకుంటున్నారు.
కాంగ్రెస్ నేతలు తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా భేటీకి సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేశారు. ప్రతిపక్ష నాయకులు ప్రజల గొంతును వినిపించేందుకు, దేశానికి కొత్త దిశను అందించాలని ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని.. దేశాన్ని కాపాడతామంటూ హిందీలో ట్వీట్ చేశారు. ఖర్గే గతంలో డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేలతోను మాట్లాడారు. 2024 లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవడానికి కొత్త సమీకరణాలను అన్వేషిస్తున్నాయి.
అయితే, కొన్ని పార్టీలు ఫ్రంట్‌లో చేరే ప్రశ్నపై తమ స్టాండ్‌ను క్లియర్ చేయగా, మరికొన్ని పార్టీలు దూరం దూరం అంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ లోకసభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడంతో ఆ పార్టీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. వామపక్షాలు, కాంగ్రెస్, బీజేపీల మధ్య కుదిరిన అవగాహన వల్లే ఓడిపోయామని ఆరోపించారు. అయితే రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు అనంతరం మమత మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు ఏకమై, బీజేపీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇదివరకు కాంగ్రెస్ దిశగా కనిపించలేదు. కానీ ఇటీవల రాహుల్ వైపు అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోందని బీజేపీ చెబుతోంది.