»Heroine Nushrat Bharucha Dating With Star Singer Honey Singh Video Viral
Viral Video: స్టార్ సింగర్ తో హీరోయిన్ డేటింగ్!
ప్రముఖ బాలీవుడ్ సింగర్ యో యో హనీ సింగ్(Honey Singh), హీరోయిన్ నుష్రత్ భరుచ్చా(Nushrat Bharucha) చేతులు పట్టుకుని చెట్టాపట్టాలేసుకున్న వీడియో(video) ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో చూసిన పలువురు వీరు డేటింగ్లో ఉన్నారని అంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా ఓ సారి చూసేయండి మరి.
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ భరుచ్చా(Nushrat Bharucha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనేక చిత్రాల్లో యాక్ట్ చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ప్రస్తుతం హీందీ చత్రపతి మూవీలో కూడా ఈ అమ్మడు హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఇటీవల స్టార్ సింగర్, ర్యాపర్ యో యో హనీ సింగ్(Honey Singh) తో కనిపించింది. ముంబైలో జరిగిన ఒక గ్రాండ్ కాన్సర్ట్‌లో హనీ సింగ్ ఓ ప్రదర్శన ఇవ్వగా..ఆ తర్వాత వీరిద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వెళుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
ఆ వీడియోలో హనీ సింగ్ నుష్రత్ భరుచ్చాతో ఎంతో క్లోజ్ గా ఉన్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు మధ్యలో ఆమె దగ్గర నుంచి హనీ సింగ్ బాటిల్ తీసుకుని ఆమెకు సపోర్టుగా ఉండటం వీడియోలో చూడవచ్చు. అంతేకాదు ఇద్దరు కూడా బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని ఉండటం గమనించవచ్చు. ఆ క్రమంలో నటి నవ్వుతూ వీడియోకు ఫోజులిచ్చింది. అంతేకాదు చుట్టుపక్కల జనం ఉన్నప్పటికీ హనీ సింగ్ మాత్రం నుష్రత్ చేతిని వదలలేదు. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కచేరీ వీరిద్దరి ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ పెంచిందని అంటున్నారు. వీరిద్దరికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. అంతేకాదు ఈ వీడియో చూసిన నెటిజన్లు పట్టణంలో కొత్త జంట, ఏదో జరుగుతోందని, వీరు డేటింగ్లో ఉన్నారా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ కామెంట్లపై వీరు ఎలా స్పందిస్తారో చూడాలి.
మరోవైపు నుష్రత్ ప్రస్తుతం తన రెండవ విడత చిత్రం ‘Chhorii 2 కోసం సిద్ధమవుతోంది. ఆమె చివరిసారిగా అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీలతో కలిసి ‘సెల్ఫీ’లో కనిపించింది. దీంతోపాటు రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ నటించిన ‘తు ఝూతీ మైన్ మక్కార్’లో కూడా నుష్రత్ ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించింది.