»Groom Dies Marriage Gift Home Theater Blast After Wedding Two Days At Champaran Chhattisgarh
Gift Effect: పెళ్లి తర్వాత హోమ్ థియేటర్ పేలి వరుడు మృతి!
పెళ్లైన రెండు రోజులకే వరుడు ఆకస్మాత్తుగా మరణించాడు. అయితే తనకు వచ్చిన హోం థియేటర్(home theater) పేలిన(blast) క్రమంలో అతను మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వరుడితోపాటు అతని బంధువు కూడా ఒకరు మృతి చెందగా, ఇంకో ఏడుగురికి గాయలయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్గఢ్(chhattisgarh)లోని రెంగాఖర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చమరి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
పెళ్లైన తర్వాత ఓ వరుడు(groom), తన బంధువుతో కలిసి తనకు చాలా బహుమతులు వచ్చాయని సంబురపడ్డాడు. ఆ క్రమంలో ఒక్కో గిఫ్టును ఓపెన్ చేసి ఎవరు ఏం తెచ్చారని చెక్ చేస్తున్నాడు. అదే క్రమంలో అతనికి ఓ హోం థియేటర్(home theater) కూడా బహుమతి(gift)గా వచ్చింది. అది చూసిన అతను సంతోషంతో చెక్ చేయడానికి దాని ప్లగ్ తీసి విద్యుత్ సాకెట్ లో పెట్టాడు. దీంతో వెంటనే అది ఆకస్మాత్తుగా పేలిపోయింది(blast). ఆ క్రమంలో వరుడితోపాటు అక్కడ ఉన్న బంధువు సైతం మృత్యువాత చెందాడు. అంతేకాదు సమీపంలో ఉన్న మరో ఏడుగురికి గాయాలు కూడా అయ్యాయి. ఈ విషాద ఘటన ఛత్తీస్గఢ్(chhattisgarh) కవార్ధా జిల్లాలోని చమారి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
అయితే ఈ ఘటన జరగడానికి రెండు రోజుల ముందు వరుడు హేమేంద్ర మెరవి వివాహం చేసుకున్నాడు. దీంతో అక్కడే ఉన్న ఇతర బంధువులు పోలీసులకు(police) ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. అయితే క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు పేలుడుకు హోం థియేటర్ కారణమా లేదా ఇంకా ఏదైనా ఉందా అనే విషయాలను కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంకోవైపు ఈ బ్లాస్ట్ ఘటనపై స్థానికుల నుంచి కూడా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఏవరైనా కావాలనే పేలుడుకు ప్లాన్ వేశారా లేదా అనుకోకుండా జరిగిందా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు.
అంతకుముందు మరో ఘటనలో న్యూఢిల్లీ(delhi)లో ప్రయోగశాల ప్రయోగంలో బ్లాస్ట్ సంభవించి ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు గాయపడ్డారు. ఉపాధ్యాయుడిని ఎయిమ్స్ ట్రామా సెంటర్లో చేర్చగా, కళాశాలలో ప్రథమ చికిత్స అందించి విద్యార్థులను ఇంటికి పంపించారు. పేలుడు సంభవించినప్పుడు ఉపాధ్యాయుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ క్లాస్లో స్వేదనం పద్ధతిని ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది.