పెళ్లి రోజు (marriage day) లేదా పెళ్లికి ముందు జరిగే వేడుకల్లో వధువులు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ఇంటర్నెట్లో ఎన్నో చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు చూడడానికి… ప్రజలను కాస్త వినోదం పంచేవిగా ఉంటాయి. ఇలాంటి జాబితాకు ఓ కొత్త వీడియో చేరింది. ఇందులో ఆనందాన్ని పంచడంతో పాటు, ఈ వీడియో ప్రజలను భావోద్వేగానికి గురి చేస్తోంది. తన హల్దీ వేడుకలో (haldi function) హృదయాన్ని కదిలించే విధంగా అమ్మాయి కన్నీళ్లు పెట్టుకున్నది. అమ్మాయి సోదరుడు ఆమెకు ఒక అందమైన ప్రదర్శనను అంకితం చేశాడు. ఈ సమయంలో వధువు తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. ఈ ఉద్వేగభరితమైన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో చాలా ఎమోషనల్గా ఉంది.
ఒక వధువు తన సోదరుడితో కలిసి కిషోర్ కుమార్ యొక్క బాబుల్ కా ఘర్ కు డ్యాన్స్ చేసింది. వీరిద్దరు ఒకరి పక్కన మరొకరు ప్రదర్శన చేస్తారు. అలాంటి సమయంలో అమ్మాయి భావోద్వేగానికి గురవుతుంది. ఆ అమ్మాయి కన్నీళ్లు తుడుచుకోవడం కనిపిస్తుంది. కెమెరా ఆ తర్వాత అమ్మాయి సోదరుడి పైకి వెళ్లింది. అతను ప్రేమతో నవ్వుతున్నప్పటికీ.. అతను కూడా కంటతడిని ఆపుకోలేకపోయాడు. అతను కూడా భావోద్వేగానికి గురవుతాడు. ఈ వీడియో ఆన్లైన్ వినియోగదారులను ఉద్వేగాన్ని కలిగిస్తోంది. కొంతమంది అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్పై వ్యాఖ్యానించగా, మరికొందరు తమ కంట కన్నీరు తెప్పించారు.