AP: గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పొన్నూరు మండల పరిధిలోని కొండముది గ్రామంలో మద్యం మత్తులో ఓ కుమారుడు తల్లిని హత్య చేశాడు. కొమ్ము జయమ్మ (60) కుమారుడు నాగరాజు మద్యానికి బానిసై నిత్యం తాగుతూ ఉండేవాడు. ఈ విషయంపై శనివారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో నాగరాజు మద్యం మత్తులో తల్లిని రోకలి బండతో తలపై దాడి చేయడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.