వరుస భూకంపాలు(Earthquakes) ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మంగళవారం పలు చోట్ల భూకంపాలు(Earthquake) చోటుచేసుకున్నాయి. మణిపూర్‌లోని నోనీలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. తెల్లవారుజామున 2.46 గంటలకు నోనీలో భూ ప్రకంపనలు జరిగాయి. రిక్టర్ స్కేలు(Richter scale)పై 3.2 తీవ్రత నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్ లో కూడా భూకంపాలు(Earthquakes) వచ్చాయి.
వరుస భూకంపాలు(Earthquakes) ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మంగళవారం పలు చోట్ల భూకంపాలు(Earthquake) చోటుచేసుకున్నాయి. మణిపూర్‌లోని నోనీలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. తెల్లవారుజామున 2.46 గంటలకు నోనీలో భూ ప్రకంపనలు జరిగాయి. రిక్టర్ స్కేలు(Richter scale)పై 3.2 తీవ్రత నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూమిలోపల 25 కిలోమీటర్ల లోతులో కదలికలు ఏర్పడ్డాయని, భూకంపం(Earthquake) ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిళ్లలేదు.
ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్ లో కూడా భూకంపాలు(Earthquakes) వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ లో మంగళవారం తెల్లవారుజామున 4.05 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలు(Richter scale)పై 4.1 తీవ్రత నమోదైంది. భూ గర్భంలో 10 కిలో మీటర్ల లోతులో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఫైజాబాద్ కు 315 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
తజికిస్తాన్ లో కూడా భూమి కంపించింది(Earthquake). ఉదయం 5.31 గంటలకు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రత నమోదైంది. భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం(Earthquake) వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిళ్లలేదు. ఈ నెల 23వ తేదిన కూడా తజికిస్తాన్ లో భూకంపం వచ్చింది. ఐదు రోజుల వ్యవధిలోనే ఇలా భూకంపం రావడం ఇది మూడోసారి.