»Delhi Liquor Policy Case Brs Mlc K Kavitha Records Her Statement Before Ed Called Again Today
Mlc Kavitha: నేడు మరోసారి ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) కేసులో నేడు మరోసారి బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ను ఈడీ(ED) అధికారులు విచారణ చేయనున్నారు. దీంతో విచారణకు వెళ్లే ముందు ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. తన ఫోన్లకు సంబంధించి ఈడీ చేస్తున్న ఆరోపణలపై కవిత క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. సోమవారం జరిగిన విచారణపై కవిత(MLC Kavitha) మీడియాతో పలు విషయాలు చెప్పే అవకాశం కూడా కనిపిస్తోంది. సోమవారం దాదాపు పదిన్నర గంటల పాటు ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను విచారించిన సంగతి తెలిసిందే.

నిన్న ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ను ఈడీ(ED) అధికారులు 14 ప్రశ్నలు అడగ్గా అన్నింటికీ ఆమె సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. అరుణ్ పిళ్లైతో కలిసి కవితను విచారించలేదని తెలుస్తోంది. కవితను, పిళ్లైని విడివిడిగా విచారించినట్లు సమాచారం. విచారణ తర్వాత బయటకొచ్చిన కవిత అభిమానులకు, కార్యకర్తలకు విజయచిహ్నం చూపిస్తూ చిరునవ్వుతో కనిపించారు. ఆ సందర్భంగా బీఆర్ఎస్(BRS) కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు గుమ్మడికాయతో దిష్టి తీశారు.
ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్లిన కవిత(MLC Kavitha)ను మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఈడీ(ED) అధికారులు మరోసారి విచారణ చేపట్టనున్నారు. దీనికి సంబంధించి నోటీసులు కూడా ఈడీ అధికారులు జారీ చేశారు. కవితను రాజకీయ ఒత్తిడిలో భాగంగానే విచారిస్తున్నారా? లేక నిందితురాలిగా పిలిచారా అని కవిత ఈడీ(ED)ని అడిగినట్లుగా సమాచారం. అయితే అనుమానితురాలిగానే పిలిచినట్లు ఈడీ అధికారులు సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెల 24న సుప్రీంలో తన పిటిషన్ పై విచారణ ఉందని కవిత(MLC Kavitha) ఈడీ అధికారులకు తెలిపారు. అంత వరకూ విచారణ ఆపాలని కోరినా ఆ విషయంలో ఈడీ అంతగా స్పందించలేదు. ఈడీ(ED) దూకుడు తెలంగాణలో పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది.