CTR: శాంతిపురం మండలం సోలిశెట్టిపల్లి గ్రామంలో గోవింద్ అనే వ్యక్తిని భార్య మీనా, ఆమె ప్రియుడు ఆనంద్ సహాయంతో హతమార్చిన వైనం వెలుగు చూసింది. భర్త గోవింద్ కళ్లల్లోకి కారం చల్లి, రాయితో కొట్టి హతమార్చినట్లు గ్రామస్థులు తెలిపారు. అక్రమ సంబంధంతోనే గోవింద్ హత్యకు గురైనట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.