WNP: పాము కాటుతో యువకుడు మృతి చెందిన విషాద ఘటన పెబ్బేరు పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన గంధం రవి(19) సోమవారం రాత్రి తన వరి పొలానికి నీళ్లు పెట్టి వస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవి మృతి చెందాడు.