WNP: వనపర్తి మండలం పెద్దగూడెం తిరుమలయ్య గుట్ట సమీపంలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి హరీష్ కుమార్ (14) శనివారం తెల్లవారుజామున 6 గంటలకు విద్యుత్ షాక్తో మరణించాడు. పాఠశాల సమీపంలోని వేరుశనగ చేనుకు పెట్టిన విద్యుత్ కంచ తగిలి చనిపోయారని స్థానికులు చెబుతున్నారు. వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు తెలుస్తోంది.