MNCL: ప్రేమ పేరుతో వంచించడంతో యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన బెల్లంపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. హనుమాన్ బస్తీకి చెందిన సాయి స్నేహిత, శ్రీనాథ్లు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. కాగా పెళ్లికి శ్రీనాథ్ నిరాకరించడంతో మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.