TG: కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలన సందర్భంగా ‘ప్రజాపాలన -ప్రజావిజయోత్సవాలు’ కార్యక్రమాన్ని రా ష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ప్రణాళిక రూపొందించాలని, ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులను భాగస్వాముల చేయాలని తెలిపారు.