హైదరాబాద్‌లోని ప్రఖ్యాత చారిత్రక కట్టడం చార్మినార్ దగ్గర బాంబు పెట్టినట్టుగా ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. చార్మినార్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. చార్మినార్ పరిసరాల్లో దాదాపు గంట సేపటి నుంచి బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు. చార్మినార్ దగ్గర ఫుట్‌పాత్‌లపై షాపులను కూడా తొలగించారు.
ఘటనాస్థలికి చేరుకున్న బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే తనిఖీల అనంతరం అది ఫేక్ కాల్ అని పోలీసులు నిర్దారించారు.
కంట్రోల్ రూమ్‌కు కాల్ వచ్చిన వెంటనే.. అది నిజమైన కాల్ లేదా ఫేక్ కాల్ అనే దానితో సంబంధం లేకుండా.. ప్రజల భద్రత ప్రాథమికంగా భావించి తాము అవసరమైన శోధనలను నిర్వహించినట్టుగా పోలీసులు తెలిపారు.