సూర్యాపేట: వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రిలో పనిచేస్తున్న కొత్తపల్లి కిరణ్మయి అనే మహిళను అదే చోట పనిచేస్తున్న పవన్ అనే వ్యక్తి వేధిస్తున్నాడు. దీంతో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వేధింపుల వల్లనే చనిపోయిందంటూ ఆసుపత్రి ముందు భౌతికకాయంతో బంధువులు ఆందోళనకు దిగారు.