Balayya-NTR : తారక రత్న మరణంతో.. బాలయ్య, ఎన్టీఆర్ సినిమాలు వాయిదా!?
Balayya-NTR :నందమూరి తారకరత్న కన్నుమూత అభిమానులను శోక సంద్రంలో పడేసింది. సినిమాల పరంగా అనుకున్నంత స్థాయిలో విజయాలు అందుకోలేకపోయినప్పటికీ.. నటనపరంగా ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేస్తునే వచ్చారు తారక రత్న. ఈ మధ్యే విలన్గా బాబాయ్ బాలయ్య సినిమాలో నటించేందుకు సరికొత్తగా మేకోవర్ అయ్యాడు.
నందమూరి తారకరత్న కన్నుమూత అభిమానులను శోక సంద్రంలో పడేసింది. సినిమాల పరంగా అనుకున్నంత స్థాయిలో విజయాలు అందుకోలేకపోయినప్పటికీ.. నటనపరంగా ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేస్తునే వచ్చారు తారక రత్న. ఈ మధ్యే విలన్గా బాబాయ్ బాలయ్య సినిమాలో నటించేందుకు సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. అలాగే రాజకీయంగాను మరో స్టెప్ వేసేందుకు రెడీ అయ్యాడు. కానీ ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. ఊహించని విధంగా జనం మధ్యలోనే కుప్పకూలిపోయాడు తారకరత్న. దాదాపు మూడు వారాల పాటు హాస్పిటల్లో మృత్యువుతో పోరాటం చేశారు. అడుగడుగున్న బాలయ్య అండగా నిలబడ్డారు. కానీ చివరికి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు తారకరత్న. ఆయన మరణం అందరినీ ఎంతగానో కలిచివేసింది. ముఖ్యంగా నందమూరి కుటుంబాన్ని తీవ్ర విషాదంలో పడేసింది. అందుకే ముందుగా అనుకున్న బాలయ్య, ఎన్టీఆర్ సినిమా షెడ్యూల్స్ పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది. బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 108వ చిత్రం చేస్తున్నారు. ఇప్పటికే ఒకటి, రెండు షెడ్యూల్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ను ఫిబ్రవరి మూడో వారం తర్వాత ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు తారక రత్న మరణంతో మరోసారి షూటింగ్ వాయిదా పడిందని తెలుస్తోంది. అలాగే చాలా కాలంగా వాయిదా పడుతు వస్తున్న ఎన్టీఆర్ 30 పూజా కార్యక్రమాలు కూడా పోస్ట్ పోన్ అయినట్టేనని అంటున్నారు. ఈ నెల 24న ఎన్టీఆర్-కొరటాల సినిమాను లాంఛనంగా ప్రారంభించాలనుకున్నారు. కానీ తారక రత్న మరణంతో.. కాస్త వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. త్వరలోనే బాబాయ్, అబ్బాయ్ షూటింగుల పై ఓ క్లారిటీ రానుంది.