ఇటీవల కొత్త తరహా సైబర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. మోసగాళ్లు పెళ్లి కార్డుల పేరుతో వాట్సప్‌లో లింకులు పంపుతున్నారు. ‘మా పెళ్లికి రండి’ అనే మెసేజ్‌తో వచ్చిన లింక్‌ను మహారాష్ట్రకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి క్లిక్ చేయగా, అతడి ఖాతా నుంచి దాదాపు రూ.2 లక్షలు మాయమయ్యాయి. దీంతో ఈ తరహా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.