KNR: వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అధ్యక్షతన ఆశా ఫెసిలిటేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో (పీహెచ్సీ) మొదటి కాన్పుల కోసం గర్భిణులను ప్రోత్సహించాలని సూచించారు. తద్వారా సాధారణ ప్రసవాలు జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో పలు అధికారులు పాల్గొన్నారు.