TG: ఆస్తికోసం ఓ కసాయి కూతురు కన్నతల్లినే కడతేర్చింది. జనగామ జిల్లా పెద్దతండాకు చెందిన లక్ష్మీ తన కూతురు సంగీతకు 5ఏళ్ల క్రితం వీరయ్యతో పెళ్లి చేసింది. కట్నంగా తనకున్న భూమిలో కొంత అమ్మి బంగారం చేయించి ఇచ్చింది. అయితే మిగిలిన భూమి కూడా కావాలంటూ తల్లిని సంగీత పలుమార్లు వేధించింది. ఫలితం లేకపోవడంతో సంగీత తన భర్తతో కలిసి.. తల్లి నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిమి చంపేసింది.