వైఎస్సార్ పార్టీ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం కడప ఎంపీ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వెకేషన్ బెంచ్ తన పిటిషన్ను విచారించాలని ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో అవినాష్ లాయర్లు ఈ పిటిషన్ గురించి ప్రస్తావించనున్నారు. మరోవైపు వివేకా హత్య కేసు దర్యాప్తు చివరి దశకు చేరుకున్న క్రమంలో సీీబీఐ అధికారులు కూడా విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో కీలక విషయాలు తెలుస్తున్న కొద్దీ అసలు ఏం జరుగుతుందనే దానిపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.