»Australia Team Dominated The First Day Oval 327 3 By India
WTC Final 2023: తొలిరోజు ఆసీస్ దే ఆధిపత్యం..327/3
లండన్‌లోని ఓవల్‌లో టీమ్ ఇండియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ తొలి రోజున ఆస్ట్రేలియాకు పూర్తి ఆధిపత్యం సాధించింది. ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 327 రన్స్ సాధించారు.
బుధవారం లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ స్టేడియంలో ప్రారంభమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ (WTC) ఫైనల్లో ఆస్ట్రేలియా(australia)తో జరిగిన మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో మొదటి రోజు ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. మహ్మద్ సిరాజ్ ఉస్మాన్ ఖవాజాను 0 పరుగులకే కట్టడి చేయడంతో భారత్ రోజును బలంగా ప్రారంభించింది. కానీ రెండో సెషన్లో పాట్ కమ్మిన్స్ అండ్ కో 76/3తో కుప్పకూలిన తర్వాత నాలుగో వికెట్‌కి కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నారు.
ఆ క్రమంలో డేవిడ్ వార్నర్ 43(60), ఉస్మాన్ ఖవాజా 0 (10), మార్నస్ లాబుస్చాగ్నే 26 (62), స్టీవ్ స్మిత్* 95 (227), ట్రావిస్ హెడ్* 146 (156) పరుగులు చేసి కీలక సపోర్ట్ ఇచ్చారు. దీంతో స్మిత్ హెడ్ల భారీ భాగస్వామ్యంతో ఆస్ట్రేలియా 85 ఓవర్లలో 327/3కి చేరుకుంది.
ఇక బౌలింగ్ చేసిన భారత(indian team) జట్టులో మహ్మద్ షమీ 1/77 (20), మహ్మద్ సిరాజ్ 1/67 (19), ఉమేష్ యాదవ్ 0/54 (14), శార్దూల్ ఠాకూర్ 1/75 (18), రవీంద్ర జడేజా 0/48 (14) ఉన్నారు. కానీ వికెట్లు పడగొట్టడం కోసం మనోళ్లు తీవ్రంగా శ్రమించినా కూడా ఫలితం లేకుండా పోయింది. బంతిని మార్చినప్పటికీ కొత్త బంతి నుంచి భిన్నమైన ఫలితాల లభించలేదు.