»Ap Cm Jagan Mohan Reddy Sudden Delhi Tour March 16th 2023 Modi Amit Shah
AP CM Jagan: సడన్ గా ఢిల్లీ వెళ్లిన జగన్..అసలేం జరిగింది?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(ap cm jagan mohan reddy) గురువారం సాయంత్రం ఆకస్మాత్తుగా న్యూఢిల్లీ(delhi tour)కి బయలుదేరారు. రాత్రి 7.15 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోగా..ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi), హోంమంత్రి అమిత్ షా(amit shah)లతో జగన్ సమావేశం(meeting) కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి(ap cm jagan mohan reddy) ఆకస్మాత్తుగా గురువారం రాత్రి ఢిల్లీ(delhi) బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమర్పణకు హాజరైన తర్వాత జగన్ రాత్రి 7.15 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు YSRCP ఎంపీలు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. మరోవైపు ఏపీ(AP)లో బడ్జెట్(budget) సమావేశాల(meetings) నేపథ్యంలో సీఎం జగన్ సడన్ గా ఢిల్లీ(delhi) వెళ్లడం పట్లు పార్టీ వర్గాలు ఏమై ఉంటుందని భయాందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు(ap assembly meetings) జరుగుతుండగా, సీఎం పర్యటన రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో కీలక సమావేశానికి ఢిల్లీకి రావాల్సిందిగా జగన్‌కు ఆకస్మాత్తుగా ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి(CM) దేశ రాజధానికి వెళ్లినప్పుడు మీడియాకు, అధికారులకు ముందస్తు సమాచారం ఉంటుంది. కానీ ఈసారి అలాంటి సూచన ఏమి జరగకుండానే వెళ్లారు.
అయితే ఈరోజు సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union home minister amit shah) తదితరులతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ఏపీలో మూడు రాజధానులు, విభజన చట్టంలో పెండింగ్ అంశాలు, మరిన్ని రుణాల సహా పలు అంశాలపై జగన్ చర్చించనున్నట్లు సమాచారం. ఏపీ ఎక్కువగా అప్పులు చేస్తోందని, దీనిపై కేంద్రం పదే పదే రాష్ట్రానికి గుర్తు చేస్తున్న అంశంపై కూడా చర్చించనున్నట్లు టాక్.
మరోవైపు వైఎస్‌కు సంబంధించి కేంద్ర సంస్థలు డేంజర్ బెల్స్ మోగించాయి. వివేకా హత్య కేసు, మద్యం కుంభకోణం. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor scam case)లో ఎంపీ కుమారుడు అరెస్టవగా, ఇంకోవైపు వివేకా హత్య కేసులో వై.ఎస్.అవినాష్ రెడ్డి సీబీఐ(CBI) విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో 2018లో తెలంగాణలో చేసినట్లే ముందస్తు అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా కేంద్రంతో సీఎం చర్చించే అవకాశం ఉందని కొన్ని వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో వివేకా హత్య కేసు, ఢిల్లీ మద్యం కుంభకోణంపై జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే జగన్ ఆకస్మికంగా ఢిల్లీ వెళ్లారని ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఆరోపిస్తోంది.