ATP: యాడికి మండలం చందన గ్రామంలో గుర్తు తెలియని దుండగులు పొలాల్లో ఉన్న నాలుగు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేశారు. కాపర్ వైర్లు, ఆయిల్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దొంగలను పట్టుకోవడం కోసం సీఐ వీరన్న ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు.