TPT: నగరంలోని ఫిష్ మార్కెట్ ఎదురుగా ఉన్న సాక్వెంజర్ కాలనీలో లావణ్య తన పెంపుడు కుక్కను స్థానికంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చి కత్తులతో కిరాతకంగా నరకడంతో పెంపుడు కుక్క చనిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆ స్టేషన్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె వాపోయింది.